Read more!

English | Telugu

టాప్ హీరోయిన్‌కు ఈడీ స‌మ‌న్లు

 

మోస‌గాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌తో అనుబంధం కారణంగా సమస్యలను ఎదుర్కొంటోంది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆమెకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మ‌రోసారి సమన్లు ​​పంపినట్లు తెలిసింది. ED ప్రధాన కార్యాలయంలో లేటెస్ట్‌ రౌండ్ ప్రశ్నల కోసం ఆమె న్యూఢిల్లీకి వెళ్లింది.

ఇటీవలి రిపోర్టుల‌ను న‌మ్మేట‌ట్ల‌యితే, ED కొత్త రౌండ్ విచారణ కోసం సమన్లు ​​జారీ చేసిన తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి రాజధానికి వెళ్లింది. అప‌కీర్తి మూట‌గ‌ట్టుకున్న‌ మోసగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌తో ఆమెకు సంబంధాలున్నాయనే ఆరోప‌ణ‌ల‌తో క్రైమ్ వసూళ్ల కింద‌ నటి నుంచి దాదాపు రూ.7.27 కోట్ల నిధులను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. కానుక‌ల విషయంలో ఆమెను ప్రశ్నించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఆమె నుంచి స్టేట్‌మెంట్‌లను కోరింది ఈడీ.

రిపోర్టుల‌ ప్రకారం, సుఖేశ్‌ తన సహచరురాలు పింకీ ఇరానీని తన మెసెంజర్‌గా చేసుకున్నాడని, అతను జాక్వ‌లిన్‌కు ఖరీదైన, విలాసవంతమైన కానుక‌ల‌ను ఇచ్చాడ‌నీ ED ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తికరమైన విష‌య‌మేంటే, ఈ ఏడాది ఫిబ్రవరి, ED త‌న‌ ఛార్జ్ షీట్‌లో జాక్వెలిన్‌ను సుఖేష్‌కు పరిచయం చేసింది పింకీ అని పేర్కొంది.

మరోవైపు, తన ప్రకటనలలో ఒకదానిలో.. గూచీ, ఛానల్, లూయిస్ విట్టన్ వంటి హై-ఎండ్ బ్రాండ్‌ల నుండి డిజైనర్ బ్యాగ్‌లు, దుస్తులు, ఇతర ఉపకరణాలతో పాటు డైమండ్ రింగ్‌లు, బ్రాస్‌లెట్‌లు వంటి వాటిని కానుక‌లుగా అందుకున్నాన‌ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వెల్లడించింది. వాస్తవానికి, చంద్రశేఖర్ తనకు బహుమతిగా ఇచ్చిన మినీ కూపర్‌ను కూడా తిరిగి ఇచ్చేశాన‌ని ఆమె తెలిపింది. అయినప్పటికీ, 2021 ఆగస్ట్ 7న సుఖేశ్‌ను అరెస్టు చేసే వరకు జాక్వ‌లిన్‌, సుఖేశ్ ప‌ర‌స్ప‌రం సంప్రదింపులు జరుపుతున్నట్లు ED కనుగొంది.