Read more!

English | Telugu

అది విష‌పూరిత స‌ర్ప‌మే.. స‌ల్మాన్ వెల్ల‌డించిన షాకింగ్ డీటైల్స్‌!

 

ముంబై శివార్లోని త‌న ఫామ్‌హౌస్‌లో నిన్న‌ పాము కాటుకు గురై వార్త‌ల్లో నిలిచాడు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్‌. ఆయ‌న‌ను వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించార‌నీ, ఆయ‌న‌ను కాటువేసింది విషపూరితం కాని పాము అనీ చెప్పుకున్నారు. స‌ల్మాన్ తండ్రి స‌లీం ఖాన్ మాట్లాడుతూ, అత‌ను రూమ్‌లోప‌ల ఉండ‌గా, ఆక‌స్మికంగా చేతిపై నొప్పి అనిపించింది. ఫామ్‌హౌస్‌లోని చిన్న చిన్న సందుల గుండా ఆ పాము లోప‌లికి వ‌చ్చింది. ఇలాంటి కేసుల్లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో అలాగే స‌ల్మాన్ విష‌యంలోనూ డాక్ట‌ర్లు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకొని, మూడు గంట‌ల‌సేపు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి, ఆ త‌ర్వాత డిశ్చార్జ్ చేశారు. స‌ల్మాన్ ఫామ్‌హౌస్‌కు తిరిగొచ్చాడు, ఎప్ప‌ట్లా ఉల్లాసంగా ఉన్నాడు అని చెప్పారు. 

Also read: తెలుగునాట 'అఖండ' లాభం 30 శాతం.. తెలంగాణ‌లో మాత్రం 87 శాతం!

ఇప్పుడు స‌ల్మాన్ పాముకాటు ఘ‌ట‌న గురించి నోరువిప్పాడు. ఈరోజే త‌న 56వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న ఆయ‌న‌, "నా ఫామ్‌హౌస్‌లోకి ఓ పాము వ‌చ్చింది. దాన్ని నేను ఓ క‌ర్ర‌తో బ‌య‌ట‌కు తీసుకుపోయాను. క్ర‌మంగా అది పాక్కుంటూ నా చేతి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. దాంతో విసిరేద్దామ‌ని దాన్ని ప‌ట్టుకున్నాను. అది మూడు సార్లు న‌న్ను క‌రిచింది. అదొక ర‌క‌మైన విష‌పూరిత స‌ర్పం. ఆరు గంట‌ల సేపు హాస్పిట‌ల్‌లో ఉండి చికిత్స తీసుకున్నాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను" అని మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.

Also read: మంచు విష్ణు క‌నిపించుట లేదు! ఆరా తీస్తున్న టాలీవుడ్ వ‌ర్గాలు!!

అంతకుముందు, సల్మాన్‌కు చికిత్స చేసిన డాక్టర్ కుల్దీప్ సల్గోత్రా మాట్లాడుతూ, "రెండు వైద్య బృందాలు సల్మాన్ ఖాన్ వద్ద ఉన్నాయి. అతని ఆరోగ్యం బాగానే ఉంది." అని వెల్ల‌డించారు.