English | Telugu

'ఐర‌న్‌ మ్యాన్' తండ్రి రాబ‌ర్ట్ డౌనీ సీనియ‌ర్ మృతి!

నిష్ణాతుడైన కౌంట‌ర్‌క‌ల్చ‌ర్ డైరెక్ట‌ర్‌, హాలీవుడ్ సూప‌ర్‌స్టార్ రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ (ఇర‌న్‌ మ్యాన్‌) తండ్రి రాబ‌ర్ట్ డౌనీ సీనియ‌ర్ మృతి చెందారు. ఆయ‌న వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. న్యూయార్క్‌లోని త‌న ఇంట్లో నిద్ర‌లోనే త‌న తండ్రి మంగ‌ళ‌వారం రాత్రి మృతి చెందార‌ని జూనియ‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్ల‌డించారు. ఐదేళ్ల‌కు పైగా ఆయ‌న పార్కిన్స‌న్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు.

"ఆయ‌న నిజ‌మైన ప్ర‌జ్ఞావంతుడైన ఫిల్మ్‌మేక‌ర్‌, జీవిత కాలమంతా ఆశావాదిగా బ‌తికిన‌వాడు. మా స‌వ‌తిత‌ల్లి లెక్క‌ల ప్ర‌కారం వారు కేవ‌లం 2000 సంవ‌త్స‌రాల‌కు పైగా ఆనందంగా వైవాహిక జీవితం గ‌డిపారు." అని రాబ‌ర్ట్ జూనియ‌ర్ రాసుకొచ్చాడు.

రాడిక‌ల్‌, యాంటీ-ఎస్టాబ్లిష్‌మెంట్ ఫిలిమ్స్‌తో హాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేశారు రాబ‌ర్ట్ డౌనీ సీనియ‌ర్‌. 'పుత్నీ స్వోప్‌', 'గ్రీజ‌ర్స్ ప్యాలెస్' లాంటి సినిమాలు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నాలు. ఈ రెండో సినిమాలో కొడుకు రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్‌, కుమార్తె అలీస‌న్ డౌనీ, మొద‌టి భార్య ఎల్సీ డౌనీ న‌టించారు. 'టు లివ్ ఇన్ ఎల్‌.ఎ.', 'బూగీ నైట్స్‌', 'మాగ్నోలియా' లాంటి సినిమాల్లో ఆయ‌న న‌టించారు.

ఆయ‌న చివ‌రిసారిగా ఫిల‌డ‌ల్ఫియాలోని ఒక చిన్న పార్కుపై 2005లో 'రిటెన్‌హౌస్ స్క్వేర్' అనే డాక్యుమెంట‌రీ రూపొందించారు. ఆయ‌న‌కు భార్య రోజ్‌మేరీ రోజ‌ర్స్ ఉన్నారు. ఆమె బెస్ట్ సెల్లింగ్ రైట‌ర్‌.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.