Read more!

English | Telugu

ఆ సీన్సే ‘ఫైటర్‌’లో హైలైట్‌ అవుతాయి.. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తాయి!

హృతిక్‌ రోషన్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఫైటర్‌’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. సిద్థార్థ్‌ ఆనంద్‌ కాంబినేషన్‌లో హృతిక్‌ గతంలో చేసిన ‘వార’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మరోసారి ఆ మ్యాజిక్‌ని రిపీట్‌ చేసేందుకు ఈ ఇద్దరూ రెడీ అవుతున్నారు. జనవరి 25న రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఇప్పటికే మంచి ట్రెండిరగ్‌లో ఉంది. ఈ ట్రైలర్‌ చూసిన వారంతా ఇండియన్‌ ‘టాప్‌ గన్‌’ అంటూ ‘ఫైటర్‌’ ప్రశంసిస్తున్నారు. రెండు భాగాలుగా వచ్చిన టాప్‌ గన్‌ చిత్రాన్ని పోలిన సన్నివేశాలతో ఆడియన్స్‌ను థ్రిల్‌ చేసేందుకు ఫైటర్‌ రెడీ అవుతున్నాడు. 

ఈ చిత్రంలోని ఫైట్స్‌ను హాలీవుడ్‌ రేంజ్‌లో చిత్రీకరించారు. ఇండియాలోనే అత్యధిక ఏరియల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉన్న సినిమాగా ఫైటర్‌ పేరు తెచ్చుకుంది. టీజర్‌, ట్రైలర్‌ లో చూపించిన ఏరియల్‌ యాక్షన్స్‌ బ్లాక్స్‌కి కూడా సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. టాప్‌గన్‌లో హీరోగా నటించిన టామ్‌ కూజ్‌ గెటప్‌లో కనిపిస్తున్న హృతిక్‌ని చూసి అందరూ థ్రిల్‌ అవుతున్నారు. ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో కూడా రిలీజ్‌ కానున్న ఫైటర్‌ సినిమా 166 నిమిషాల నిడివితో ఆడియన్స్‌ ముందుకి రానుంది. రెండు గంటల 46 నిమిషాల నిడివి ఉన్న ఈ యాక్షన్‌ సినిమాలో ఎక్కువ శాతం ఏరియల్‌ షాట్స్‌ ఉంటాయట. ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. మరి ఫైటర్‌ సినిమాతో హృతిక్‌, సిద్ధార్థ్‌ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో, బాక్సాఫీస్‌ పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తారనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.