Read more!

English | Telugu

క‌బీర్ యాక్ష‌న్‌లోకి దిగుతున్నాడు.. వార్ సీక్వెల్‌లో ప్ర‌భాస్‌!

వార్ సినిమా మూవీ ల‌వ‌ర్స్ కి మేజ‌ర్ క‌బీర్ గురించి స్పెష‌ల్ ఇంట్ర‌డ‌క్ష‌న్ అస‌లు అక్క‌ర్లేదు. అంత‌లా జనాల‌ను మెస్మ‌రైజ్ చేసిన కేర‌క్ట‌ర్ క‌బీర్‌ది. రీసెంట్‌గా ప‌ఠాన్‌లోనూ క‌బీర్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. జిమ్‌, క‌బీర్ క‌లిసి దేశానికి ఎంతో సేవ చేశార‌ని, బెస్ట్ స్పైస్ అని రీకాల్ చేసుకున్నాయి ప‌ఠాన్ కేర‌క్ట‌ర్స్. ప‌ఠాన్‌లో టైగ‌ర్‌ని చూసిన ప్రేక్ష‌కుల‌కు గూస్‌బంప్స్ వ‌చ్చాయి. ప‌ఠాన్ శ‌త్రువుల చేతికి చిక్కిన‌ప్పుడు టైగ‌ర్ వ‌చ్చి కాపాడాడు.

టైగ‌ర్‌కి అలాంటి అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు ప‌ఠాన్ కూడా త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని మాటిచ్చాడు. టైగ‌ర్‌3లో ప‌ఠాన్ ఎంట్రీ త‌ప్ప‌కుండా ఉంటుంది. ఆల్రెడీ య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివ‌ర్శ్‌లో ఫేమ‌స్ అయిన స్పై కేర‌క్ట‌ర్లు మూడు. ఒక‌టి ప‌ఠాన్‌, రెండు టైగ‌ర్‌, మూడు క‌బీర్‌. య‌స్‌... ఇన్ని రోజులు ప‌ఠాన్‌, టైగ‌ర్‌3 గురించి విష‌యాలు షేర్ చేసుకున్న య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ త్వ‌ర‌లోనే క‌బీర్ గురించి కూడా ఆడియ‌న్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పనుంది. క‌బీర్ క‌నిపించే వార్ మూవీకి సీక్వెల్ చేయ‌బోతున్నారు మేక‌ర్స్.

హృతిక్ రోష‌న్ క‌బీర్‌గా న‌టించిన సినిమా వార్‌. టైగ‌ర్‌ష్రాఫ్‌, వాణీక‌పూర్ కీ రోల్స్  చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కించారు. 317.91 కోట్లు బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌తో దుమ్మురేపింది వార్‌. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం హృతిక్ ఫైట‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాను కూడా సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తున్నారు. దీని త‌ర్వాత వార్ సీక్వెల్ మొద‌లైతే, దానికి సిద్ధార్థ్ డైర‌క్ష‌న్ చేస్తారా?  లేదా? అనే డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. ఒక‌వేళ సిద్ధార్థ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే, ప్ర‌భాస్ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. వార్ సీక్వెల్‌లోనే ప్ర‌భాస్‌కి ఇంపార్టెంట్ కేర‌క్ట‌ర్‌ని డిజైన్ చేస్తార‌నే మాట‌లు కూడా వినిపిస్తున్నాయి. వీట‌న్నిటికీ క్లారిటీ రావాలంటే సిద్ధార్థ్ ఓపెన్‌గా త‌న మ‌న‌సులో ఏం ఉందో చెప్పాలి. లేకుంటే, అప్ప‌టిదాకా ఈ క‌న్‌ఫ్యూజ‌న్ మాత్రం పోదు.

హృతిక్ ఫైట‌ర్‌తో బిజీగా ఉంటే, ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాల‌తో య‌మా బిజీగా ఉన్నారు.