English | Telugu

హృతిక్ తో డేటింగ్.. మాస్క్ పెట్టుకున్న ఆ బ్యూటీని గుర్తుపట్టారా?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తాజాగా ఓ యువతి చెయ్యి పట్టుకొని నడుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీంతో హృతిక్ తో అంత చనువుగా ఉన్న ఆమె ఎవరు అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆమె ఎవరో కాదు మ్యుజీషియన్, యాక్ట్రెస్ సబా ఆజాద్ అని, ఆమెతో హృతిక్ కొద్దిరోజులుగా డేటింగ్ లో ఉన్నాడని న్యూస్ వినిపిస్తోంది.

హృతిక్ ఓ యువతి చేయి పట్టుకొని ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు, వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాస్క్ పెట్టుకొని ఉండటంతో ఆ యువతి ఎవరనేది మొదట అర్థంకాలేదు. అయితే, రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కారు ఎక్కేంత వరకు హృతిక్ ఆమె చేతిని వదలకపోవడంతో.. ఆమె ఎవరని తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. అయితే ఆ యువతి సబా ఆజాద్ అని తెలిసిపోయింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ఇటీవల ఇద్దరూ గోవాలో హాలిడే ఎంజాయ్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది.

భార్య తో 2014 లో విడాకులు తీసుకున్న 48 ఏళ్ల హృతిక్.. కొంతకాలంగా 32 ఏళ్ల సబా ఆజాద్ తో డేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. గతంలో నసీరుద్దీన్ షా తనయుడు ఇమాద్ షాతో ప్రేమాయణం సాగించిన సబా ఆజాద్.. అతనికి బ్రేకప్ చెప్పి ఇటీవల హృతిక్ కి దగ్గరైనట్లు సమాచారం.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.