Read more!

English | Telugu

క‌శ్మీర్‌కి వెళ్లిన హృతిక్ రోష‌న్‌, దీపిక ప‌దుకోన్‌

సినిమా స‌క్సెస్ అయింది క‌దా అని, సెల‌బ్రేష‌న్ మోడ్‌ని ఆన్ చేసి ఉంటే ఏం బావుంటుంది? ఆ ఉత్సాహాన్ని నెక్స్ట్ సినిమాకి పెట్టుబ‌డిగా పెట్టాల‌ని అంటున్నారు దీపిక ప‌దుకోన్‌. అందుకే ఇప్పుడు క‌శ్మీర్‌కి ఎగిరిపోయారు. ముంబై నుంచి హృతిక్ ఆల్రెడీ క‌శ్మీర్‌కి ఫ్లైట్ ఎక్కేశారు. అటు దీపిక కూడా కశ్మీర్‌కి చేరుకున్నారు. వారిద్ద‌రూ క‌లిసి స్పై థ్రిల్ల‌ర్ ఫైట‌ర్‌లో న‌టిస్తున్నారు.

ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ పుణె ప‌రిస‌రాల్లో జ‌రిగింది. దీపిక ప‌దుకోన్ న‌టించిన ప‌ఠాన్ జ‌న‌వ‌రి 25న విడుద‌లైంది. ఈ సినిమాలో ఆమె చేసిన ఫైట్స్, స్టంట్స్ చూసి ఫిదా అయ్యారు జ‌నాలు. వారి అంచ‌నాల‌ను ఇంకొంచెం పెంచేలా ఆ మ‌ధ్య షారుక్ ఇచ్చిన స్పీచ్ కుదిరింది. రియ‌ల్ ఫైట‌ర్ హృతిక్ రోష‌న్ కాద‌నీ, దీపిక‌నే అని హింట్ ఇచ్చారు షారుఖ్‌. దీపిక మీద భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ తీశార‌ట ఫైట‌ర్ మేక‌ర్స్. ఆ విష‌యం తెలిసి దీపిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇప్పుడు క‌శ్మీర్‌లో తీస్తున్న సీక్వెన్స్ ఇంట‌ర్వెల్‌కి ముందు వ‌స్తుంద‌ని తెలిసింది. అటు హృతిక్ న‌టించిన విక్ర‌మ్ వేదా ఈ మ‌ధ్య‌నే విడుద‌లైంది. సైఫ్ అలీఖాన్‌, రాధికా ఆప్టేతో క‌లిసి న‌టించారు హృతిక్‌. సినిమా పెద్ద హిట్ అయింది.

దీపిక నెక్స్ట్ ప్ర‌భాస్‌తో ప్రాజెక్ట్ కె చేస్తున్నారు. ఈ సినిమాలోనే అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా కీ రోల్ చేస్తున్నారు. అటు హృతిక్ రోష‌న్‌, ప్ర‌భాస్ క‌లిసి కూడా ఓ సినిమా చేయ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఆ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హృతిక్, ప్ర‌భాస్‌తో క‌లిసి నెక్స్ట్ సినిమా చేస్తున్నార‌ట క‌దా అని ఆ మ‌ధ్య సిద్ధార్థ్‌ని నార్త్ మీడియా క్వ‌శ్చ‌న్ చేసింది. అయితే ఆ విష‌యాన్ని దాట‌వేసిన డైర‌క్ట‌ర్ త‌న దృష్టి మొత్తం ఇప్పుడు జ‌స్ట్ ఫైట‌ర్ మీద మాత్ర‌మే ఉంద‌ని అన్నారు.