English | Telugu

తగ్గేదేలే.. హిందీలో మరో సినిమాతో బన్నీ సందడి!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'. డిసెంబర్ 17 న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా హిందీలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ తో సత్తా చాటింది.

పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ ఊహించని విధంగా పెరిగిపోయింది. తన డైలాగ్ డెలివరీ, మ్యానరిజంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందర్నీ ఆకట్టుకున్నాడు. క్రికెటర్స్ సైతం బన్నీని ఇమిటేట్ చేస్తూ తగ్గేదేలే అంటున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు బన్నీ ఏ స్థాయిలో ప్రభావితం చేశాడో. ఇన్నాళ్లు సౌత్ లో సత్తా చాటిన బన్నీ పుష్ప సినిమాతో నార్త్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి అక్కడి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ గత చిత్రం 'అల వైకుంఠపురములో' సినిమా హిందీలో విడుదలకు సిద్ధమైంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా ఘన విజయాన్ని అందుకుంది. పుష్ప హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు గోల్డ్ మైన్స్ సంస్థ 'అల వైకుంఠపురములో' సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేస్తోంది. ఈ సినిమా జనవరి 26 న థియేటర్స్ లో విడుదల కానుంది. మరి పుష్పతో హిందీలో సంచనాలు సృష్టించిన బన్నీ.. 'అల వైకుంఠపురములో'తో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.