English | Telugu
ప్రభాస్, షారూఖ్‌కి సన్నీడియోల్ షాక్
Updated : Sep 4, 2023
పాన్ ఇండియా స్టార్స్ అయిన టాలీవుడ్ హీరో ప్రభాస్, బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌లకు సీనియర్ బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ షాకిచ్చారు. ఇదే ఇప్పుడు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఏ విషయంలో అని అనుకుంటున్నారా? ప‌్రత్యేకంగా దేనిగురించో చెప్పనక్కర్లేదు. గద్దర్ 2 కలెక్షన్స్ గురించే. దాదాపు 23 ఏళ్ల క్రితం వచ్చిన గద్దర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. దానికి కొనసాగింపుగా గద్దర్ 2 సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 11న రిలీజైంది. బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కావటంతో గద్దర్ 2పై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. అయితే సన్నీడియోల్ సినిమా చేసి చాలా రోజులు కావటంతో సినిమా ఏం ఆడుతుందిలే అని అనుకున్నవాళ్లూ లేకపోలేదు.
ఏదైతేనేం గద్దర్ 2 ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను దాటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే మూవీ రూ. 500 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఈ వసూళ్ల విషయంలో గద్దర్ 2 ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా బాహుబలి 2 హిందీ వెర్షన్, షారూఖ్ ఖాన్ మూవీ పఠాన్ రికార్డులను గద్దర్ 2 క్రాస్ చేసింది. రూ.500 కోట్ల మార్కును రీచ్ కావటానికి పఠాన్ సినిమాకు 28 రోజులు పట్టింది. ఇక బాహుబలి 2 హిందీ వెర్షన్ అయితే 34 రోజుల్లో ఈ మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసింది. కానీ గద్దర్ 2 మాత్రం ఈ వసూళ్లను సాధించటానికి 24 రోజులను మాత్రమే తీసుకుంది.
