English | Telugu

బాలీవుడ్‌లో ఇరుగుపొరుగున ఉంటున్న స్టార్స్ వీరే!

బాలీవుడ్‌లో ఇరుగుపొరుగున ఉంటున్న స్టార్స్ వీరే!

 

ఇటీవ‌లే ముంబైలోని జుహు ఏరియాలో స్టార్ యాక్ట‌ర్ అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఓ విలాస‌వంత‌మైన భ‌వంతిని కొన్నాడు. త‌ద్వారా ఆయ‌న ఎవ‌రికి పొరుగువాడ‌య్యాడో తెలుసా? అమితాబ్ బ‌చ్చ‌న్‌కు! ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ 'మేడే' మూవీలో క‌లిసి న‌టిస్తున్నారు. లేటెస్ట్‌గా ఇరుగు పొరుగు వార‌వుతున్నారు. ముంబై మ‌హాన‌గ‌రంలో ఇలా ప‌ర‌స్ప‌రం ప‌క్కింటివాళ్ల‌యిన‌ మ‌రికొంత‌మంది సెల‌బ్రిటీలు కూడా బాలీవుడ్‌లో ఉన్నారు.

షారుఖ్ ఖాన్ - స‌ల్మాన్ ఖాన్‌


బాలీవుడ్‌లోని ఖాన్ త్ర‌యంలోని ఇద్ద‌రు మెగాస్టార్లు షారుఖ్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్ బాంద్రా ఏరియాలో సంప‌న్నుల నివాసం ఉండే ప్రాంతంలో నివ‌సిస్తున్నారు. షారుఖ్ భ‌వ‌నం 'మ‌న్న‌త్' నుంచి స‌ల్మాన్ ఉండే 'గాల‌క్సీ' అపార్ట్‌మెంట్‌కు చేరుకోవాలంటే మూడు నాలుగు నిమిషాల న‌డ‌క స‌రిపోతుంది.

హృతిక్ రోష‌న్‌-అక్ష‌య్ కుమార్‌


ఈ ఇద్ద‌రు అంద‌గాళ్లు జుహులోని ప్ర‌ధాన ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇద్ద‌రి ఇళ్లు ప‌క్క‌ప‌క్క‌నే ఉంటాయి. 2020లో జ‌న‌తా క‌ర్ఫ్యూ సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు నిర్మాత సాజిద్ న‌దియ‌డ్‌వాలాతో క‌లిసి ఒకేచోట క‌నిపించారు.

షాహిద్ క‌పూర్‌-అలియా భ‌ట్‌


'ఉడ్తా పంజాబ్‌', 'షాందార్' సినిమాల్లో క‌లిసి న‌టించిన షాహిద్ క‌పూర్‌, అలియా భ‌ట్ జుహూ ఏరియాలో ప‌క్క ప‌క్కనే నివ‌సిస్తుంటారు.

శిల్పా శెట్టి-శ్ర‌ద్ధా క‌పూర్‌


ముంబై, జుహులో ఉన్న తారా రోడ్దులోనే శిల్పా శెట్టి, శ్ర‌ద్ధా క‌పూర్ల ఇద్ద‌రి నివాసాలూ ఉన్నాయి.

బాలీవుడ్‌లో ఇరుగుపొరుగున ఉంటున్న స్టార్స్ వీరే!

బాలీవుడ్‌లో ఇరుగుపొరుగున ఉంటున్న స్టార్స్ వీరే!

బాలీవుడ్‌లో ఇరుగుపొరుగున ఉంటున్న స్టార్స్ వీరే!