English | Telugu

నెట్‌ఫ్లిక్స్ హిస్ట‌రీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చిన మూవీ ఇదే!

డ్వేన్ జాన్స‌న్ (ద రాక్‌), ర్యాన్ రేనాల్డ్స్‌, గ‌ల్ గ‌దోత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన 'రెడ్ నోటీస్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఓపెనింగ్ డే అత్య‌ధిక వ్యూస్ సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా ర్యాన్ రేనాల్డ్స్ షేర్ చేశాడు. త‌న స‌హ‌న‌టులు డ్వేన్ జాన్స‌న్‌, గ‌ల్ గ‌దోత్‌తో ఉన్న ఫొటోతో పాటు అత‌ను పంచుకున్నాడు. "వావ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీ 'రెడ్ నోటీస్‌'. మొత్తం టీమ్‌కు కంగ్రాట్స్" అని ట్వీట్ చేశాడు.

రాస‌న్ మార్ష‌ల్ తుర్బ‌ర్ డైరెక్ట్ చేసిన 'రెడ్ నోటీస్' మూవీ, థియేట‌ర్ల‌లో రిలీజైన వారం త‌ర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యింది. లేడీ గ‌జ‌దొంగ సారా బ్లాక్ (గ‌దోత్‌)ను ప‌ట్టుకోవ‌డానికి మ‌రో దొంగ నోల‌న్ బూత్ (ర్యాన్ రేనాల్డ్స్‌)తో క‌లిసి ఎఫ్‌బీఐ ఆఫీస‌ర్ జాన్ హార్ట్‌లీ (జాన్స‌న్‌) ఎలా క‌ష్ట‌ప‌డ్డాడ‌నేది ఈ సినిమాలోని ప్ర‌ధానాంశం.

ద రాక్ సైతం #BiggestOpeningDayForRedNotice అనే ట్యాగ్‌తో జిమ్ నుంచి ఓ వీడియోను షేర్ చేసి ఈ ఆనంద‌క‌ర సంద‌ర్భాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.