Read more!

English | Telugu

డ్రీమ్ గ‌ర్ల్ 2లో ఆయుష్మాన్‌ని చూశారా?


డ్రీమ్ గ‌ర్ల్  2 టీజ‌ర్ రిలీజ్ అయింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించిన డ్రీమ్ గ‌ర్ల్ సినిమాకు సీక్వెల్ ఇది. ఫ‌స్ట్ పార్ట్ 2019లో రిలీజ్ అయింది. రొమాంటిక్ కామెడీ సినిమాగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన మూవీ ఇది. ఆడియ‌న్స్ జోయ్ రైడ్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మూవీ అని అప్ప‌ట్లో రివ్యూలు అందుకుంది. ఆయుష్మాన్ ఖురానా న‌టించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద స‌క్సెస్ ద‌క్కింది. ఆ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ప్రేక్ష‌కులు ప‌ట్టంక‌ట్టారు.ఇప్పుడు లేటెస్ట్ గా డ్రీమ్ గ‌ర్ల్ 2 టీజ‌ర్ వైర‌ల్ అవుతోంది. ఆయుష్మాన్ ఖురానా ఎప్పుడు ప్రెస్ ముందుకు వ‌చ్చినా డ్రీమ్ గ‌ర్ల్ సీక్వెల్ ఎప్పుడు చేస్తార‌ని అడిగేవారు. ఆ సినిమాకు సీక్వెల్ త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని గ‌త ఏడాది అనౌన్స్ చేశారు ఆయుష్మాన్‌. ఆ ప్ర‌కార‌మే న‌యా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. అన‌న్య పాండేని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్త‌యింది. ఈ సినిమాను ఈ ఏడాది జులై 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

లాస్ట్ ఇయ‌ర్ లైగ‌ర్ సినిమా షూటింగ్ చేస్తున్న‌ప్పుడే ఈ సినిమాకు సంత‌కం చేశారు అన‌న్య పాండే. లైగ‌ర్ ఎలాగూ ఫ్లాప్ అయింది. ఈ సినిమా అయినా హిట్ కావాల‌ని కోరుకుంటున్నారు మిస్ పాండే. ఆమె అభిమానుల‌తో చిట్‌చాట్‌లోనూ డ్రీమ్ గ‌ర్ల్ గురించి గొప్ప‌గా చెబుతున్నారు.డ్రీమ్ గ‌ర్ల్ 2 టీజ‌ర్ ఫ‌న్నీగా ఉంది. ఆయుష్మాన్ ఖురానా బ్యాక్‌లెస్ పింక్ లెహంగాలో పిచ్చ హాట్‌గా ఉన్నారు. ఆయ‌న ఫేస్ చూపించ‌క‌పోయినా, రెడ్ లిప్‌స్టిక్ మాత్రం చూపించారు మేక‌ర్స్.  టీజ‌ర్‌లో షారుఖ్ ప‌ఠాన్ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఫోన్‌లో ప‌ఠాన్‌ని ఫ్ల‌ర్ట్ చేస్తున్నారు  పూజా కేర‌క్ట‌ర్‌లో ఉన్న ఆయుష్మాన్‌.ఈ సినిమాలో పూజాగా, క‌ర‌మ్‌గా రెండు పాత్ర‌ల్లో న‌టించారు ఆయుష్మాన్‌. పూజా డ్రీమ్ గ‌ర్ల్ ఈజ్ బ్యాక్ అంటూ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు ఆయుష్మాన్‌.