English | Telugu
భర్తతో విడిపోనున్నదనే రూమర్స్‌కు ఒక్క కామెంట్‌తో చెక్ పెట్టిన ప్రియాంక!
Updated : Nov 22, 2021
అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోమవారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పేరులో నుంచి భర్త ఇంటిపేరు 'జోనాస్'ను తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి జోనాస్ పేరుతీసేసి, ప్రియాంక అని మాత్రమే వుంచడంతో ఇంటర్నెట్ యూజర్స్ షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే ప్రియాంక, నిక్ జోనాస్ మధ్య అనుబంధం చెడిపోయిందనీ, త్వరలోనే వారు విడిపోనున్నారనీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.
అయితే, నిక్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు ప్రియాంక పెట్టిన కామెంట్ వారు విడిపోనున్నారనే రూమర్స్‌కు చెక్ పెట్టింది. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో ఒకదాన్ని నిక్ పోస్ట్ చేశాడు. దీనికి "Damn! I just died in your arms…❤️. (డామ్.. నేను నీ చేతుల్లో ఇప్పుడే చనిపోయాను)" అని కామెంట్ పెట్టింది ప్రియాంక. దాన్ని బట్టి నిక్‌ను ఆమె ఎంతగా లవ్ చేస్తోందనే విషయం అర్థమైంది. అయితే జోనాస్ అనే పేరును తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సడన్‌గా ఎందుకు తొలగించిందనే దానికి మాత్రం ప్రియాంక రెస్పాండ్ కాలేదు.
ఇంతకుముందు, ప్రియాంక తల్లి మధు చోప్రా తన కూతురు, అల్లుడు విడిపోనున్నారంటూ వస్తున్న రూమర్స్‌ను కొట్టిపారేసి, అలాంటి వాటిని వ్యాప్తి చేయొద్దని నెటిజన్స్‌ను రిక్వెస్ట్ చేశారు.
ఇటీవలే ఇదే తరహాలో సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి 'అక్కినేని' అనే ఇంటిపేరును తొలగించడం, దాంతో చైతన్యతో ఆమె విడిపోనున్నదంటూ ప్రచారంలోకి రావడం, చివరకు అది నిజం కావడం మనం చూశాం. ఇప్పుడు ప్రియాంక కూడా అదే తరహాలో తన భర్త ఇంటిపేరును తన పేరులోంచి తొలగించివుంటుందని భావించిన నెటిజన్స్.. నిక్‌తో ఆమె విడిపోనున్నదనే రూమర్స్ స్టార్ట్ చేశారు.