English | Telugu

నా ప‌ని న‌న్ను ప‌రిచ‌యం చేయాలి:  భూమి ఫ‌డ్నేక‌ర్‌

నా ప‌ని న‌న్ను ప‌రిచ‌యం చేయాలి:  భూమి ఫ‌డ్నేక‌ర్‌

బాలీవుడ్ దివా భూమి ఫ‌డ్నేక‌ర్ ఇచ్చే స్టేట్ మెంట్లు జ‌నాల‌కు ఇన్‌స్ప‌యిరింగ్‌గా ఉంటాయి. వృత్తి ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌, అంకిత‌భావంతో తానేంటో నిరూపించుకున్న న‌టి భూమి ఫ‌డ్నేక‌ర్‌. వ‌ర్క్ మీద ఆమెకున్న ప్యాష‌న్ గురించి ఆమెతో ప‌నిచేసిన వారు డీటైల్డ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. త‌న ప‌నిని తాను ప్రేమించే తీరు, న‌ట‌న ప‌ట్ల త‌న‌కున్న గౌర‌వాన్ని గురించి షేర్ చేసుకున్నారు భూమి ఫ‌డ్నేక‌ర్‌. ``నేను వ‌ర్క్ హాలిక్ ప‌ర్స‌న్‌ని. ఆ నిజం నాకు తెలుసు. నాకు అర్థ‌మైన నిజాన్ని నేను ప్రేమిస్తున్నాను. నాకు నా జీవితంలో ప్ర‌తి క్ష‌ణాన్ని కొత్త‌గా జీవించాల‌ని ఉంటుంది. ఏదో కొత్త‌గా ట్రై చేయాల‌ని ఉంటుంది. యాక్టింగ్ చాలా గొప్ప ప్రొఫెష‌న్‌. దాన్ని తేలిగ్గా తీసుకోకూడ‌దు. నేను ఏ సెట్‌లోకి అడుగుపెట్టినా, ఆ మేక‌ర్స్ కి రుణ‌ప‌డి ఉన్నాన‌ని భావిస్తాను. నా ప‌నికి 200 శాతం న్యాయం చేయ‌డానికి కృషి చేస్తాను`` అని అన్నారు. 

ఆమె ఇంకా చెబుతూ ``నేను ఏ సినిమా చేసినా బాధ్య‌త‌గా భావిస్తాను. మ‌న క‌ల్చ‌ర‌ల్ లెగ‌సీని భావి త‌రాల‌కు అందించే మార్గాలు సినిమాలు. మ‌నం ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నామో, వాటిని చూసి భావిత‌రాలు ఎన్నెన్నో విష‌యాల‌ను అర్థం చేసుకుంటారు. అందుకే క‌ళాకారులంద‌రూ ఎప్పుడూ బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి`` అని అన్నారు. నా సినిమాల్లో క‌ల్చ‌ర‌ల్ ఇంపాక్ట్ ఉంద‌నిపిస్తే చాలా ఆనందిస్తాను. క‌థ వింటున్న‌ప్పుడు నాకు స్ఫూర్తిని పంచే స్క్రిప్టులు ఉంటే, ఇంకేం ఆలోచించ‌కుండా సినిమాకు సంత‌కం చేస్తాను అని అన్నారు భూమి. ఆమె ఇటీవ‌ల సుధీర్ మిశ్రా సినిమా `అఫ్వా`లో న‌టించారు. ఇందులో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, ష‌రీబ్ హష్మి, సుమీత్ వ్యాస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ది లేడీ కిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు భూమి.