English | Telugu

గోస్వామి బయోపిక్ తో అనుష్క రీఎంట్రీ.. టీజర్ అదిరింది

బాలీవుడ్ నటి అనుష్క శర్మ మూడేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌ గా రానున్న 'చక్దా ఎక్స్‌ప్రెస్' సినిమాలో ఆమె నటిస్తోంది. తన కుమార్తె వామిక పుట్టిన తర్వాత అనుష్క చేస్తున్న మొదటి సినిమా ఇదే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇస్తూ ఓ టీజర్ ను విడుదల చేశారు.

'చక్దా ఎక్స్‌ప్రెస్' సినిమా అనౌన్స్ మెంట్ టీజర్ ఆకట్టుకుంటోంది. సచిన్, సౌరబ్, సెహ్వాగ్ ఇలా మేల్ క్రికెటర్స్ పేర్లతో జెర్సీలను తీసుకొని.. వాటిపై తమ పేర్లు రాసుకొని గ్రౌండ్ లోకి అడుగుపెడతారు ఫిమేల్ క్రికెటర్స్. అంతేకాదు, వారి మ్యాచ్ చూడటానికి ఆడియన్స్ కూడా ఎవరూ రారు. మహిళల క్రికెట్ కి ఇండియాలో ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమయంలో ఝులన్ గోస్వామి వంటి వారు ఎంతో కృషి చేసి మహిళల క్రికెట్ కి గుర్తింపు తెచ్చిన విషయాన్ని ఈ సినిమాలో చూపిబోతున్నట్లుగా.. టీజర్ ద్వారా చెప్పేశారు.

ఝులన్ గోస్వామి పాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉంది అని అనుష్క తెలిపింది. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అనుష్క, ఆమె సోదరుడు కర్ణేష్‌ శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ లోవిడుదల కానుంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.