Read more!

English | Telugu

జుల‌న్ గోస్వామి బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్న అనుష్క‌!

 

ఇండియ‌న్ క్రికెట‌ర్ జుల‌న్ గోస్వామి బ‌యోపిక్‌లో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ న‌టించాల్సి ఉంది. షారుక్ ఖాన్ సినిమా 'జీరో' (2018) త‌ర్వాత ఆమె న‌టించే బిగ్ ఫిల్మ్ ఇదే అవుతుంద‌ని అంతా అనుకున్నారు. భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ అయిన జుల‌న్ గోస్వామి బ‌యోపిక్‌ను ప్రోసిత్‌ రాయ్ డైరెక్ష‌న్‌లో అనుష్క‌కు చెందిన క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ నిర్మించ త‌ల‌పెట్టింది. విమెన్స్ వ‌న్ డే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు సాధించిన బౌల‌ర్ అయిన జుల‌న్‌.. ప‌ద్మ‌శ్రీ‌, అర్జున్ అవార్డులు అందుకుంది. ఆమె బ‌యోపిక్ ఈ ఏడాదే సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉంది.

Also read:  క‌త్రినా-విక్కీ పెళ్లి.. అతిథులు బ‌స‌చేసే ఒక్కో టెంట్ అద్దె ఒక్క రాత్రికి 70 వేల పైమాటే!

అయితే లేటెస్ట్ రిపోర్టుల ప్ర‌కారం, జుల‌న్ క్యారెక్ట‌ర్‌ను అనుష్క చెయ్య‌బోవ‌డం లేదు. ఆమె ఆ పాత్ర నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణాలు బ‌య‌ట‌కు వెల్ల‌డి కాలేదు కానీ, ఈ బ‌యోపిక్ ఉంటుంద‌నీ, దాన్ని అనుష్క సొంత నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ నిర్మిస్తుంద‌నీ మాత్రం తెలిసింది. అనుష్క‌తో 'ప‌రి' మూవీని చేసిన ప్రోసిత్ రాయ్ ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నున్నాడు. గ‌త ఏడాది కోల‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ గ్రౌండ్‌లో అనుష్క‌, జుల‌న్ క‌లిసున్న ప‌లు ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చి వైర‌ల్ కావ‌డంతో బ‌యోపిక్ విష‌యం వార్త‌ల్లో నిలిచింది. డైరెక్ట‌ర్ ప్రోసిత్ కూడా ఆ ఫొటోల్లో క‌నిపించాడు.

Also read:  ఆర్థిక నేర‌గాడు సుఖేశ్‌తో రిలేష‌న్‌షిప్‌లో జాక్వ‌లిన్? ఫొటో వైర‌ల్!

ఇప్పుడు జుల‌న్ క్యారెక్ట‌ర్ కోసం మ‌రో న‌టి అన్వేష‌ణ‌లో ఉన్నాడు ప్రోసిత్‌. ప‌శ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లా నుంచి  ప్రారంభించి, లార్డ్స్‌లో విమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ దాకా సాగిన జుల‌న్ క్రికెట్ జ‌ర్నీనీ, ఈ క్ర‌మంలో ఆమె వ్య‌క్తిగ‌త జీవితాన్నీ ఈ బ‌యోపిక్‌లో చూపించ‌నున్నారు.