Read more!

English | Telugu

'వై ఐ కిల్డ్ గాంధీ'ని పూర్తిగా బ్యాన్ చెయ్యాలి!

 

షార్ట్ ఫిల్మ్ 'వై ఐ కిల్డ్ గాంధీ'ని పూర్తిగా బ్యాన్ చెయ్యాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఆల్ ఇండియా సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ (AICWA) కోరింది. మ‌హాత్మా గాంధీని హ‌త్య‌చేసిన నాథూరామ్ గాడ్సేని కీర్తించేలా ఉన్న ఆ ఫిల్మ్‌ను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తూ ప్ర‌ధానికి ఆ సంఘం ఒక లేఖ రాసింది. అంత‌కుముందు, 'వై ఐ కిల్డ్ గాంధీ'లో నాథూరామ్ గాడ్సే క్యారెక్ట‌ర్‌ను పోషించిన ఎన్సీపీ స‌భ్యుడు, న‌టుడు అమోల్ కోల్హే తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యారు. ఇప్పుడు ఆ ఫిల్మ్‌పై అంద‌రి దృష్టీ మ‌ళ్లింది.

Also read: బ్రేకింగ్‌.. హిందీ 'అల వైకుంఠ‌పుర‌ములో' థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌ట్లేదు!

"జాతిపిత మ‌హాత్మా గాంధీజీని హ‌త్య‌చేసిన దుర్మార్గుడు నాథూరామ్ గాడ్సేని కీర్తించిన 'వై ఐ కిల్డ్ గాంధీ' జ‌న‌వ‌రి 30న ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుద‌ల కాబోతోంది. అలా విడుద‌ల కాకుండా ఆ ఫిల్మ్‌ను పూర్తిగా నిషేధించాల్సిందిగా ఆల్ ఇండియా సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ డిమాండ్ చేస్తోంది. గాంధీజీని దేశం మొత్తం, ప్ర‌పంచం కూడా ఆరాధిస్తుంటుంది. గాంధీజీ ఐడియాల‌జీని ప్రేమ‌కూ, త్యాగానికీ చిహ్నంగా ప్ర‌తి భార‌తీయుడూ భావిస్తాడు. ఈ దేశంలో ఎవ‌రికీ ఒక్క అంగుళం గౌర‌వానికి కూడా నాథూరామ్ గాడ్సే అర్హుడు కాడు. గాడ్సే పాత్ర‌ను చేసింది భార‌త రాజ్యాంగం కింద ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ ఒక సిట్టింగ్ ఎంపీ. ఈ మూవీ రిలీజైతే మొత్తం దేశ‌మే షాక్‌కు గుర‌వుతుంది. మొత్తం దేశం త‌ర‌పున‌, అన్ని సినిమా సంఘాల త‌ర‌పున 'వై ఐ కిల్డ్ గాంధీ' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ కాకుండా బ్యాన్ చెయ్యాల్సిందిగా మేం డిమాండ్ చేస్తున్నాం" అని ఆ లేఖ‌లో రాశారు.

Also read: సునీల్‌శెట్టి ఇంట్లో ఈ ఏడాది రెండు పెళ్లిళ్లు!

2017లో తీసిన 'వై ఐ కిల్డ్ గాంధీ' ఫిల్మ్ మ‌హాత్మా గాంధీ వ‌ర్ధంతి అయిన జ‌న‌వ‌రి 30న లైమ్‌లైట్ ఓటీటీలో రిలీజ‌వుతోంది.