English | Telugu
యాక్షన్ థ్రిల్లర్ మొదలుపెడుతున్న ఆలియా
Updated : Aug 2, 2023
ఆలియా భట్ మెయిన్ లీడ్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. వాసన్ బాలా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలుకానుంది. రీసెంట్‌గా ఆమె నటించిన రీఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ విడుదలైంది. రణ్‌వీర్ సింగ్ నటించిన చిత్రమిది. ఈ నెల్లో ఆమె ఫస్ట్ హాలీవుడ్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ స్టోన్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. వాసన్ సినిమాకు సంబంధించి మేజర్ పోర్షన్ ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటుంది. కొంత భాగాన్ని విదేశాల్లో తెరకెక్కిస్తారు. ఈ సినిమాలోనూ ఆలియా కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓ మామూలు మధ్య తరగతి అమ్మాయి... జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల ద్వారా ఎలా మారిపోయింది అనే కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది.
ఈ సినిమా తర్వత వచ్చే ఏప్రిల్‌లో ఆమె సంజయ్ లీలా భన్సాలి యాంబిషియస్ ప్రాజెక్ట్ బైజు బావ్రాలో నటిస్తారు. ఆలియా, రణ్‌వీర్ కలిసి చేస్తారు ఈ సినిమాలో. ఈ సినిమా పోర్షన్ పూర్తయ్యాక, యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమా కోసం ప్రిపరేషన్ మొదలుపెడతారు. ఈ మూడు సినిమాల్లోనూ ఆలియాకు జస్ట్ డ్రమటిక్ సన్నివేశాలు మాత్రమే కాదు, యాక్షన్ సీక్వెన్స్ కూడా హెవీగా ఉంటాయి. ఈ సినిమాలన్నీ ఓ కొలిక్కి వచ్చాక డార్లింగ్స్ డైరక్టర్‌తోనూ ఓ సినిమా చేయాలన్నది ఆలియా ప్లాన్. ``డార్లింగ్‌కి అది సీక్వెల్ కాదు. ఇంకో కథతో తెరకెక్కుతుంది. ఆలియాకు అతను చెప్పిన కథ నచ్చింది. అయితే జస్మీత్ ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ చేస్తున్నారు. ఒక్క సారి కథ లాక్ కాగానే, కాల్షీట్ల గురించి ఆలోచిస్తారు`` అని అంటున్నారు ఆలియా సన్నిహితులు.