Read more!

English | Telugu

దీపిక అమేజింగ్ అంటున్న ఒబెరాయ్!

యూఎస్ లో హాలిడే పూర్తిచేసుకుని తిరిగి వచ్చారు అక్షయ్ ఒబెరాయ్. 2023లో అద్భుతమైన ప్రాజెక్ట్ తో హుషారుగా ఉన్నారు అక్ష‌య్ ఒబెరాయ్‌. హృతిక్ రోషన్, దీపికా పదుకోన్‌తో సినిమాలు చేస్తున్నారు అక్షయ్ ఒబెరాయ్. దీపికా పదుకోన్‌, హృతిక్ రోషన్ జంటగా నటిస్తున్న ఫైటర్ లో ఎయిర్‌ఫోర్స్  ఆఫీసర్గా నటిస్తున్నారు అక్షయ్ ఒబెరాయ్. వ‌చ్చే ఏడాది జనవరి లో విడుదల కానుంది ఫైటర్.

ఫైటర్ గురించి అక్షయ్ మాట్లాడుతూ ``నన్ను ఇప్పటికీ ప్రేక్షకులు పీకూలో నటించిన అణికేత్‌గా గుర్తుపెట్టుకున్నారు. అందులో నేను చేసింది చాలా చిన్న కామియా రోల్ అయినప్పటికీ, నన్ను జనాలు అంతగా గుర్తు పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం నా జీవితంలో మర్చిపోలేని ఏడాది అవుతుంది. చాలా కొత్త, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అద్భుతమైన నటీనటులతో ఈ ఏడాది కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నాను. మనం స్ఫూర్తిని ఎక్కడినుంచైనా పొందవచ్చు. నేను నా సహ నటీనటులను చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటాను`` అని అన్నారు. దీపిక  గురించి మాట్లాడుతూ ``నేను ఇంతకుముందు దీపిక ప‌దుకోన్‌తో పీకూ అనే సినిమా చేశాను. ఇప్పుడు ఆమెతో కలిసి మళ్ళీ పని చేయడం చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు.

సారా తో చేస్తున్న సినిమాలో పాత్ర‌ గురించి ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు. అక్షయ్ 2023 చాలా అద్భుతమైన ఏడాదిగా వర్ణించారు. గ్యాస్ లైట్ అనే సినిమాలో నటిస్తున్నారు అక్షయ్. సారా, విక్రాంత్ మాసే ఈ సినిమాలో కీలక పాత్రధారులు.