Read more!

English | Telugu

అతని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల 12 సినిమాలు వెనక్కి వెళ్లాయి 

రెండో సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో అధ్యయన్ సుమన్. దాంతో ఒకేసారి పన్నెండు సినిమాలు తన ఇంటి ముందుకు వచ్చాయి. కానీ ఒకే ఒక్క చిత్రంతో అవన్నీ దూరమయ్యాయి. అందుకు కారణం ఎవరో కాదు నేనే. కేవలం నా నా  స్వయం కృతాపరాధమే అంటున్నాడు.

అధ్యయన్ ఎవరో కాదు  ప్రముఖ హిందీ నటుడు శేఖర్ సుమన్ తనయుడు. తండ్రి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తు  2008 లో చిత్ర రంగ ప్రవేశం చేసాడు. హాల్ ఇ దిల్ అతని మొదటి సినిమా. మొదటి సినిమాకే మంచి నటుడు అనే గుర్తింపు పొందాడు.ఇక ఆ తర్వాత వచ్చిన రాజ్ 2  తో బాలీవుడ్ కి సరికొత్త సూపర్ స్టార్ రాబోతున్నాడనే కితాబుని అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా తర్వాత తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి  ఇటీవల  జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. రాజ్ తర్వాత మంచి పేరు వచ్చిందని  ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఫీలయ్యాను.ఒక పత్రిక సైతం టాప్ ఫైవ్ న్యూ కమర్స్ అంటు రణబీర్ కపూర్, ఇమ్రాన్ ల సరసన నా ఫోటో పబ్లిష్ చేసింది. ఇది కదా అసలైన మజా అనుకున్నాను. అప్పుడే నా లైఫ్ యు టర్న్ తీసుకుంది. మూడో సినిమా జష్న్ ప్లాప్ అయ్యింది. ఇక అంతే నేను సంతకం చేసిన 12 సినిమాలు ఆగిపోయాయి. దిగులుగా  కూర్చునే కంటే జీవితంలో ముందుకు సాగిపోవడమే మంచిదని అనుకున్నాను అని చెప్పాడు. ఇప్పడు ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాకపోతే  ఇక్కడ విచిత్రం ఏంటంటే  తనతో పాటే ప్లాప్ సినిమాలు చేసిన చాలా మంది హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటు వెళ్తున్నారు. ప్రస్తుతం   హీరామండి అనే  వెబ్ సిరీస్ లో చేసాడు.   ఇందులో  శేఖర్ సుమన్ కూడా ఉన్నాడు. నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా  మే 1 న విడుదల కానుంది. ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దానికి దర్శకుడు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి లు ప్రధాన పాత్రల్లో  మెరిశారు