English | Telugu

నీనా గుప్తాతో "ఈ నైట్ నాతో గ‌డ‌ప‌డం లేదా?" అన్న ఆ నిర్మాత ఎవ‌రు?

దేశంలోని చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కేస్టింగ్ కౌచ్ అనేది కొన్నేళ్లుగా ఓ టాపిక్‌గా ఉంటూ వ‌స్తోంది. సీనియ‌ర్ న‌టి, లెజండ‌రీ వెస్ట్ ఇండీస్ క్రికెట‌ర్ వివియ‌న్ రిచ‌ర్డ్స్ ద్వారా ఓ కూతుర్ని క‌న్న నీనా గుప్తా త‌న కేస్టింగ్ కౌచ్ అనుభ‌వం గురించి త‌న ఆటోబ‌యోగ్ర‌ఫీలో వివ‌రించారు. ఒక‌సారి ఒక ద‌క్షిణాది నిర్మాత త‌న పాత్ర గురించి డిస్క‌స్ చేయ‌డానికి ఆయ‌న రూమ్‌కు పిలిపించాడ‌ని ఆమె వెల్ల‌డించారు. "నీది హీరోయిన్ ఫ్రెండ్ రోల్.. అని చెప్పాడు. ఆయ‌న వివ‌రించిన దాని ప్ర‌కారం అది పెద్ద‌గా ప్రాధాన్యం లేని చిన్న పాత్ర‌. దాంతో నేను, 'ఓకే. నేనిక వెళ్తాను సార్, నాకోసం ఫ్రెండ్స్ ఎదురుచూస్తున్నారు' అని చెప్పాను. 'వెళ్తావా? ఎక్క‌డికి? ఈ నైట్ ఇక్క‌డ గ‌డ‌ప‌డం లేదా?' అని నిజంగా షాక‌వుతూ అడిగాడు. ఒక్క‌సారిగా నా నెత్తిమీద ఎవ‌రో ఒక బ‌కెట్ ఐస్ వాట‌ర్ కుమ్మ‌రించిన‌ట్లు అనిపించింది. నా ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టిన‌ట్ల‌యింది." అని ఆమె వివ‌రించారు.

అలాంటి ఘ‌ట‌న‌లు ఎదుర్కోవ‌డం తార‌ల‌కు అదే ఫ‌స్ట్ టైమ్ కాదు. ఇదివ‌ర‌కే ప‌లువురు తార‌లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అనుభ‌వాల‌ను బ‌హిర్గ‌తం చేశారు.

కంగ‌నా ర‌నౌత్‌


బాలీవుడ్ న‌టి, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ కంగ‌నా ర‌నౌత్ త‌న‌కు ఎదురైన కేస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఓ న్యూస్ చాన‌ల్‌తో పంచుకున్నారు. "ఇది నేను జ‌న‌ర‌లైజ్ చేసి చెప్తున్న‌ది కాదు. సెట్స్ మీద ఏ తార అయినా త‌న భార్య‌లా న‌డ‌చుకోవాల‌ని ఎ లిస్ట్, బి లిస్ట్‌, బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్స్ ఆశిస్తుంటారు. ఒక సినిమా త‌ర్వాత ఒక సినిమా. ఒక హీరో త‌ర్వాత ఇంకో హీరో. ఇండ‌స్ట్రీలో ఇదొక ప‌చ్చి నిజం." అని ఆమె చెప్పారు.

రాధికా ఆప్టే


తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన రాధికా ఆప్టే త‌ను ఎదుర్కొన్న ఓ అనుభ‌వం గురించి చెప్పారు. "ఒక‌సారి సౌత్ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ న‌టుడు నా రూమ్ ఫోన్‌కు కాల్ చేసి, నాతో స‌ర‌సాలాడ్డానికి ప్ర‌య‌త్నించాడు. నేన‌ప్పుడు అత‌నితో రూడ్‌గా వ్య‌వ‌హ‌రించాను. ఆ త‌ర్వాత అత‌ను నాతో గొడ‌వ పెట్టుకున్నాడు. అయితే, నువ్వు మాతో ప‌డుకోవాల‌నే రిక్వెస్ట్ మాత్రం నాకు రాలేదు. ఆ.. గుర్తుకువ‌చ్చింది. ఒక‌సారి నాకో కాల్ వ‌చ్చింది. బాలీవుడ్‌లో తాము ఓ సినిమా చేస్తున్నామ‌ని చెప్పారు. ఓసారి త‌మ‌ను క‌లుసుకోవాల‌ని చెప్పారు. ఆ హీరోతో ప‌డుకోవ‌డం మీకు ఓకేనా అని కూడా అడిగారు. నేను న‌వ్వేశాను. మీరు చాలా ఫ‌న్నీగా మాట్లాడుతున్నార‌నీ, ఆ ప‌ని నేను చేయ‌న‌నీ అన్నాను. ఆ న‌టుడ్ని న‌ర‌కానికి వెళ్ల‌మ‌ని చెప్పండి అని చెప్పాను." అని ఆమె వివ‌రించారు.

చిత్రాంగ‌దా సింగ్‌


ఇండ‌స్ట్రీలో కేస్టింగ్ కౌచ్ అనేది కొన‌సాగుతోంద‌ని బాలీవుడ్ తార చిత్రాంగ‌దా సింగ్ చెప్పారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె, "ప్ర‌తిచోటా ఇలాంటి మ‌నుషులు ఉన్నారు. మోడ‌లింగ్ చేసే రోజుల నుంచీ, బాలీవుడ్ దాకా అనేక‌సార్లు వాళ్ల‌ను నేను చూశాను. కార్పొరేట్ ఇండ‌స్ట్రీ కూడా అంతే బ్యాడ్‌. నా విష‌యంలో అది జ‌రిగింది. అయితే బాలీవుడ్ అనేది మిమ్మ‌ల్ని బ‌ల‌వంతం చేసే ఇండ‌స్ట్రీ కాద‌ని నేను చెప్ప‌ద‌ల‌చుకున్నాను. ప్ర‌తి ఒక్క‌రికీ త‌మ చాయిస్‌ల‌కు త‌గ్గ‌ట్లు గౌర‌వం పొందే చోటు త‌గినంత ఉంది. అవ‌కాశం పోయిన‌ప్పుడు బాధ‌గా అనిపిస్తుంది కానీ అవ‌కాశాల్ని మీరు సృష్టించుకోవ‌చ్చు. కాబ‌ట్టి దాని గురించి బాధ‌ప‌డాల్సిన ప‌నిలేదు." అని చెప్పారు.

టిస్కా చోప్రా


'బ్రూస్ లీ', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' సినిమాల్లో న‌టించిన టిస్కా చోప్రా తాను ఓ డైరెక్ట‌ర్‌తో కేస్టింగ్ కౌచ్‌కు గుర‌య్యాన‌ని వెల్ల‌డించారు. అత‌నితో సినిమా ఒప్పుకోవడం అంటే, షూటింగ్ జ‌రిగింత కాలం అత‌ని చేతుల్లో న‌లుగుతూ ఉండట‌మే అని చెప్పారు. దానికి మీకు ఓకేనా?.. అని ఆమె ప్ర‌శ్నించారు.

సుర్వీన్ చావ్లా


కొన్ని త‌మిళ చిత్రాల‌తో పాటు 'రాజు మ‌హ‌రాజు' సినిమాలో శ‌ర్వానంద్ జోడీగా న‌టించిన సుర్వీన్ చావ్లా.. ద‌క్షిణాదిన తన‌కు కేస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియెన్స్ ఎదుర‌య్యింద‌ని చెప్పారు. "అప్పుడు నేను సౌత్‌కు వెళ్లాను. అది చాలా పెద్ద దెబ్బ‌. మూడుసార్లు నేను కౌస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. ఒక ఫిల్మ్ డైరెక్ట‌ర్‌తో ఒక రెక్కీకి తోడుగా వెళ్లాల‌ని చెప్పారు. అత‌ను 'నీ బాడీలో ప్ర‌తి అంగుళం తెలుసుకోవాల‌ని అనుకుంటున్నాను.' అని ఫోన్‌లో అన్నాడు. అప్ప‌ట్నుంచీ అత‌ని కాల్స్‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాను." అని తెలిపారు.