Read more!

English | Telugu

షాకింగ్‌.. మ్యాథ్స్ టీచ‌ర్ త‌న‌తో మిస్‌బిహేవ్ చేశాడ‌ని వెల్ల‌డించిన దేవ‌లీనా!

 

'గోపి బ‌హు'గా త‌న ఐకానిక్ క్యారెక్ట‌ర్‌తో పాపుల‌ర్ అయిన న‌టి దేవ‌లీనా భ‌ట్టాచార్జీ త‌న చిన్న‌త‌నంలో మ్యాథ్స్ ట్యూష‌న్ టీచ‌ర్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని వెల్ల‌డించ‌డం అంద‌ర్నీ షాక్‌కు గురిచేసింది. అత‌డిపై తాను పోలీసుకు ఫిర్యాదు చేయాల‌నుకున్నాన‌నీ, అయితే పేరెంట్స్ అడ్డుకోవ‌డంతో చేయ‌లేక‌పోయాన‌నీ చెప్పింది.

'లేడీస్ వ‌ర్సెస్ జెంటిల్‌మెన్ సీజ‌న్ 2' షోలో దేవ‌లీనా త‌న‌కెదురైన ఘ‌ట‌న గురించి మాట్లాడింది. ఈ షో కొత్త ప్రోమోలో దేవ‌లీనా, "ఆయ‌న‌క్క‌డ‌ మంచి టీచ‌ర్‌. అంద‌రూ ఆయ‌న‌ ద‌గ్గ‌ర ట్యూష‌న్ చెప్పించుకోవ‌డానికి వెళ్తుంటారు. మంచి స్టూడెంట్స్ అంద‌రూ, నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఇద్ద‌రు కూడా అత‌ని ద‌గ్గ‌ర‌కు ట్యూష‌న్‌కు వెళ్లేవారు. స‌డ‌న్‌గా ఒక వారం త‌ర్వాత నా ఫ్రెండ్స్ వెళ్ల‌డం మానేశారు. వాళ్లు ఓ వారం వెళ్లారు. కానీ త‌ర్వాత మానేశారు" అని చెప్పింది.

ఆ టీచ‌ర్ భార్య‌కు ఈ విష‌య‌మై కంప్ల‌యింట్ చేశాన‌నీ, ఆయ‌న‌పై స్ట్రిక్ట్ యాక్ష‌న్ కూడా తీసుకోవాల‌ని అనుకున్నాన‌నీ కూడా ఆమె వెల్ల‌డించింది. "ఆ త‌ర్వాత నేను ట్యూష‌న్‌కు వెళ్లాను. ఆయ‌న‌ నాతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. నేను ఇంటికి వెళ్ల‌గానే అమ్మ‌కు ఈ విష‌యం చెప్పాను. మేం ఆయ‌న ఇంటికి వెళ్లి ఆయ‌న భార్య‌కు ఈ విష‌యం చెప్పాం. ఇది జ‌రిగింది. కానీ నేను నిజంగా ఆయ‌న‌పై గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌నుకున్నాను. ఎందుకంటే అక్క‌డ నా ఫ్రెండ్స్ ఇద్ద‌రున్నారు. బ‌హుశా వాళ్ల‌కు కూడా అది జ‌రిగి వుండొచ్చు. అందుకే వాళ్లు ట్యూష‌న్ మానేసి వుంటారు" అని చెప్పుకొచ్చింది దేవ‌లీనా.

"న‌లుగురికీ ఈ విష‌యం తెలిస్తే ఏమ‌వుతుందోన‌నే భ‌యంతో నా ఫ్రెండ్స్ నాకు ఈ విష‌యం చెప్ప‌కుండా వుండొచ్చు. నా కుటుంబం కూడా అలాగే ఆలోచించింది. అందుకే వాళ్లు పోలీసుల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేదు. ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌లూ తీసుకోలేదు. ఇవాళ‌, నాకోసం నేను నిల‌బ‌డి యాక్ష‌న్ తీసుకోవాల‌నుకుంటున్నాను" అని కూడా ఆమె చెప్పింది.

త‌ల్లిదండ్రుల‌ను ఉద్దేశించి ఒక ముఖ్య‌మైన మెసేజ్‌ను ఆమె పంచుకుంది. "ఇది.. స‌మాజానికి, అంద‌రు పేరెంట్స్‌కు నేనిచ్చే స‌ల‌హా. మీ పిల్ల‌లు ఇలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొని బాధ‌కు గురైన‌ప్పుడు ద‌య‌చేసి చ‌ర్య‌లు తీసుకోండి." అందామె. ప‌ని విష‌యానికి వ‌స్తే 'బిగ్ బాస్ 15'లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆమె అడుగుపెట్టింది.