Read more!

English | Telugu

నేను చ‌నిపోలేదు.. బ‌తికే ఉన్నా!

 

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ క‌పూర్ చ‌నిపోయాడంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. చండీగ‌ఢ్‌లో ఓ కుక్క‌ను కాపాడ‌బోయి, యాక్సిడెంట్‌కు గురై మ్య‌త్యువాత ప‌డ్డాడంటూ రిపోర్టులు వ‌చ్చాయి. అయితే తాను చ‌నిపోలేద‌నీ, క్షేమంగా ఉన్నాన‌నీ స్వ‌యంగా మోహ‌న్ క‌పూర్ ప్ర‌క‌టించారు. బాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన ఆయ‌న ప్ర‌స్తుతం యు.ఎస్‌.లో మార్వెల్ కంపెనీ తీస్తున్న సూప‌ర్ హీరో సిరీస్ 'మిస్ మార్వెల్'‌లో న‌టిస్తున్నారు. 

ఆయ‌న మృతి చెందాడ‌నే ఫేక్ వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో అభిమానులు, శ్రేయోభిలాషులు సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తూ వ‌స్తున్నారు. దీంతో తాను క్షేమంగా ఉన్నానంటూ ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ క‌న్‌ఫ్యూజ‌న్‌కు కార‌ణం.. చండీగ‌ఢ్‌లో చ‌నిపోయిన వ్య‌క్తి పేరు కూడా మోహ‌న్ క‌పూర్ కావ‌డ‌మే! ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ, "హ‌లో ఎవిరిబ‌డీ, నేను క్షేమంగా, బాగా ఉన్నాను. నా పేరుతోటే ఉన్న ఓ వ్య‌క్తి చ‌నిపోయార‌ని ఇటీవ‌ల వార్త వ‌చ్చింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌నీ, ఆయ‌న కుటుంబానికీ, ఆయ‌న‌ను ప్రేమించే వ్య‌క్తుల‌కూ ధైర్యం చేకూరాల‌నీ ప్రార్థిస్తున్నాను'" అని ట్వీట్ చేశారు మోహ‌న్ కపూర్‌.

మూడు ద‌శాబ్దాలుగా సినీ, టీవీ రంగంలో న‌టుడిగా రాణిస్తున్న మోహ‌న్ క‌పూర్ బాలీవుడ్‌లో బాడీగార్డ్‌, హేట్ స్టోరీ, జాలీ ఎల్ఎల్‌బీ, హ్యాపీ న్యూ ఇయ‌ర్‌, మిష‌న్ మంగ‌ళ్ త‌దిత‌ర చిత్రాల్లో ప్రాముఖ్యం ఉన్న పాత్ర‌లు పోషించారు.