English | Telugu

ఆషికీ 3 మొద‌ల‌య్యేది అప్పుడే!

ఆషికీ 3 మొద‌ల‌య్యేది అప్పుడే!

బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ హీరోగా న‌టిస్తున్న సినిమా ఆషికీ3. ఇటీవ‌ల స‌త్య‌ప్రేమ్‌కీ క‌థ సినిమాతో క్లౌడ్ నైన్‌లో ఉన్నారు కార్తిక్ ఆర్య‌న్‌. కియారా అద్వానీ నాయిక‌గా న‌టించిన సినిమా స‌త్య‌ప్రేమ్‌కీ క‌థ‌. కార్తిక్ ఆర్య‌న్ 2024లో అనురాగ్ బ‌సు డైర‌క్టోరియ‌ల్ ఆషికీ3 షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు. ఎప్ప‌టి నుంచో కార్తిక్ ఆర్య‌న్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమా ఇది. 2024 ఫ‌స్టాఫ్ లో స్టార్ట్ అయ్యే షూటింగ్ కోసం ఇప్ప‌టి నుంచే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి నుంచి త‌ప్ప‌కుండా షూటింగ్‌కి హాజ‌ర‌వుతాన‌ని చెప్పార‌ట కార్తిక్ ఆర్య‌న్‌. ఈ విష‌యాన్నే భూష‌ణ్ కుమార్ కూడా స్ప‌ష్టం చేశారు.

``అనురాగ్ బ‌సు - కార్తిక్ ఆర్య‌న్ సినిమాను జ‌న‌వ‌రి నుంచి ప్రారంభిస్తాం. ప్ర‌స్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. మిగిలిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా చేస్తున్నాం`` అని అన్నారు. 2022లో ఆషికీ3 గురించి అనౌన్స్ చేశారు కార్తిక్ ఆర్య‌న్‌. అంత‌కు ముందే కార్తిక్ ఆర్య‌న్ వెళ్లి భూష‌ణ్ కుమార్‌ని ఆఫీస్‌లో క‌లిసిన‌ప్పుడు కూడా సోష‌ల్ ఈమీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కార్తిక్ ఆర్య‌న్ ప్ర‌స్తుతం క‌బీర్ ఖాన్ డైర‌క్ష‌న్‌లో చందు చాంపియ‌న్‌లో న‌టిస్తున్నారు. లండ‌న్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింది. ఇటీవ‌లే ముంబైకి తిరిగి వ‌చ్చారు కార్తిక్ ఆర్య‌న్‌. ఈ సినిమా త‌ర్వాత హ‌న్స‌ల్ మెహ‌తా డైర‌క్ష‌న్‌లో కెప్టెన్ ఇండియాలోనూ న‌టించాల్సి ఉంది కార్తిక్ ఆర్య‌న్‌.