English | Telugu

బాలీవుడ్ డైరెక్టర్ కోసం 'బ‌బ్లీ బౌన్సర్'గా మారిన త‌మ‌న్నా

స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే కొందరు పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. మరికొందరు పాన్ ఇండియా సినిమాలతో పలకరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మిల్కీబ్యూటీ త‌మ‌న్నా వచ్చింది. ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో పాన్ ఇండియా మూవీ చేస్తోంది. తాజాగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించారు. త‌మ‌న్నాతో 'బ‌బ్లీ బౌన్సర్' అనే బాక్సింగ్ నేప‌థ్యం ఉన్న చిత్రాన్ని ముధ‌ర్ భండార్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తాజాగా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ మాట్లాడుతూ.. గ‌తంలో తాను తెర‌కెక్కించిన సినిమాల‌కు భిన్నంగా బ‌బ్లీ బౌన్స‌ర్ ఉండ‌నుంద‌ని, బాక్స‌ర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్లుగా తెలిపారు. త‌మ‌న్నా ఈ సినిమాలో ఓ మ‌హిళ బౌన్స‌ర్ గా న‌టిస్తున్నార‌ని, భార‌త‌దేశంలో తొలిసారిగా ఓ మ‌హిళ బౌన్స‌ర్ క‌థ ఆధారంగా వ‌స్తున్న తొలి సినిమా ఇదే అని, ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని మధుర్ అన్నారు.

త‌మ‌న్నా మ‌ట్లాడుతూ.. "నా కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్ర‌లో క‌నిపించ‌డం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాను. మ‌ధుర్ ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారిగా న‌టించ‌డం చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాతో న‌న్ను ప్రేక్షకులు మ‌రింతగా ఆద‌రిస్తార‌ని అశిస్తున్నాను" అన్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.