English | Telugu

బాలీవుడ్ లో సమంత హవా మొదలైంది.. 'రాజీ'కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సిరీస్ లో 'రాజీ' అనే పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది సమంత. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కుతున్నాయి. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత పోషించిన రాజీ పాత్రకు తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.

Also Read:సామ్ `య‌శోద‌`లో `క్రాక్` లేడీ విల‌న్!

2021 కి గాను ఫిల్మ్ ఫేర్ తాజాగా ఓటీటీ అవార్డులను ప్రకటించింది. ఇందులో సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ కు ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఫిల్మ్ ఫేర్ ట్వీట్ చేయగా.. 'థ్యాంక్యూ ఫిల్మ్ ఫేర్' అంటూ సమంత రీట్వీట్ చేసింది.

Also Read:మైత్రీకి సామ్ ఫ్యాక్ట‌ర్ మ‌రోసారి ప్ల‌స్స‌య్యేనా!

ఫిల్మ్ ఫేర్ ప్రకటించిన ఓటీటీ అవార్డ్స్ లో 'ది ఫ్యామిలీ మ్యాన్', 'స్కామ్ 1992' సిరీస్ లు పలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ప్రధాన పాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పాయ్ కి బెస్ట్ యాక్టర్(క్రిటిక్స్) అవార్డు లభించింది. క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ సిరీస్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు 'ది ఫ్యామిలీ మ్యాన్-2' కు వచ్చాయి. ఇక 'స్కామ్ 1992' సిరీస్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ సిరీస్ వంటి పలు అవార్డులు సొంతం చేసుకుంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.