English | Telugu

కాజల్ ఉండగా సాయి పల్లవి కోసం యుద్ధమా..?

ఈ సోషల్ మీడియా యుగంలో.. సినిమా విడుదల వరకు కూడా అవసరంలేదు.. ప్రకటన సమయం నుంచే ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నింటినీ తట్టుకొని.. సినిమాను రిలీజ్ చేసి, కంటెంట్ తో మెప్పించి.. హిట్ కొట్టాలి. ఇప్పుడు అలాంటి టాస్కే 'రామాయణ' టీమ్ ముందు ఉంది.

బాలీవుడ్ లో 'రామాయణ' ఫిల్మ్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నితేష్ తివారి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కి కూడా మంచి స్పందన లభించింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. సీత, మండోదరి పాత్రలకు ఎంపిక చేసిన నటీమణుల విషయంలోనే సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.

సాయిపల్లవి కంటే కాజల్ బాగుంటుంది.. అలాంటిది అంత అందమైన భార్యను కాదని, సాయిపల్లవి కోసం యశ్ యుద్ధానికి దిగుతాడా? అంటూ పలు మీమ్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే వీటిని సాయిపల్లవి ఫ్యాన్స్ తిప్పి కొడుతున్నారు. కాజల్ తో పోల్చి పల్లవిని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని అంటున్నారు. సాయి పల్లవి న్యాచురల్ బ్యూటీ అని.. పైగా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో హీరోలనే డామినేట్ చేసిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సీతగా సాయిపల్లవిని స్క్రీన్ మీద చూసి అందరూ సర్ ప్రైజ్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు.