Read more!

English | Telugu

హిందీలో 250 కోట్లతో 'RRR' సంచలనం

'ఆర్ఆర్ఆర్' మూవీ మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. ఇండియన్ సినీ చరిత్రలో వెయ్యి కోట్ల మార్క్ అందుకున్న మూడో సినిమాగా నిలిచింది. తాజాగా హిందీ వెర్షన్ 250 కోట్ల నెట్ సాధించి సత్తా చాటింది.

పాండెమిక్ తర్వాత హిందీలో 250 కోట్ల నెట్ రాబట్టిన సినిమాగా 'ది కాశ్మీర్ ఫైల్స్' రికార్డు సృష్టించగా.. రెండో సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 23 రోజుల్లో ఆర్ఆర్ఆర్ హిందీలో 251.52 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. మొదటి వారం 133.07 కోట్లు, రెండో వారం 76.25 కోట్లు, మూడో వారం 36 కోట్ల నెట్ వసూలు చేసిన ఆర్ఆర్ఆర్.. నాలుగో వారంలో శుక్రవారం 3 కోట్లు, శనివారం 3.20 కోట్లు రాబట్టింది.

వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ చేసిన 'ఆర్ఆర్ఆర్' ఇప్పటిదాకా 581.69 కోట్ల షేర్(1071 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. 23 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో  262.58 కోట్లు, కర్ణాటకలో 42.50 కోట్లు, తమిళనాడు 37.31 కోట్లు, కేరళ 10.30 కోట్లు, హిందీ 123 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 8.85 కోట్లు, ఓవర్సీస్ లో 97.15 కోట్ల షేర్ రాబట్టింది.