English | Telugu
సన్నీ డియోల్ ఇంతవరకు ఆ పని చేయలేదా?
Updated : Sep 11, 2023
సన్నీ డియోల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్, వెర్సటైల్ యాక్టర్. ఇటీవల ఆయన నటించిన గదర్2 పెద్ద సక్సెస్ అయింది. ఈ మాసివ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు సన్నీడియోల్. గదార్2 ది కథ కంటిన్యూస్‌లో ఆయనతో పాటు అమీషా పటేల్ కూడా నటించారు. ఈ సినిమాలోనే కాదు, ఆయన ఇప్పటిదాకా నటించిన ప్రతి సినిమాకు కూడా ప్రాణం పోశారు. అయితే నటనకు సంబంధించి సన్నీడియోల్ కొన్ని కీలక విషయాలను ప్రకటించారు. ఆయన ఇప్పటిదాకా ఎప్పుడూ ఫిల్మ్ స్క్రిప్టులను చదవలేదట. డైలాగులను కూడా చదవలేదట. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాల గురించి ఓపెన్ అయ్యారు. తను స్క్రిప్ట్ పరంగా, డైలాగుల పరంగా ఎలా జడ్జిమెంట్‌కి వస్తారో కూడా అందులో చెప్పారు. ఆయన మాట్లాడుతూ ``నేను ఎప్పుడూ స్క్రిప్ట్స్ చదవను. డైలాగులు చదవను. షూటింగ్‌కి ముందు అలా చదవడం నాకు అలవాటు లేదు. నేను జస్ట్ డైలాగులను ఫీల్ అవుతాను. ఎమోట్ అవుతాను. నాకు డైరక్టర్లు స్క్రిప్ట్ ఇచ్చినప్పటికీ నేను దాన్ని చదవను. మళ్లీ మళ్లీ నెరేట్ చేయమనే అడుగుతాను. డైలాగులు కూడా నేనేం చెప్పాలో వాళ్లనే చెప్పమంటాను. వాళ్లు చెప్పిన లైన్లలోని భావాన్ని అర్థం చేసుకుని నేను ఎలా చెప్పాలో అలాగే చెబుతాను. అది నాకు అలవాటు`` అని అన్నారు.
డైలాగుల గురించి మాట్లాడుతూ ``ఏదైనా చదవడం కన్నా, నేను వినడం ద్వారానే ఎక్కువ ఎమోషనల్‌గా ఫీలవుతాను. ఒకసారి విన్న తర్వాత అది మనసులో ఉండిపోతుంది. చదువుతుంటే ఏదో కంఠతా పట్టినట్టు కఠినంగా ఉంటుంది. కానీ, ఇలా చేయడం వల్ల ఈజీగా గుర్తుండిపోతుంది. అందుకే నేను స్క్రీన్ మీద ఏది మాట్లాడినా కృతకంగా అనిపించదు. చాలా స్వచ్ఛంగా ఉంటుంది`` అని అన్నారు.
డిస్లెక్సియా ఉండటం వల్లనే తాను చిన్నప్పుడు కూడా సరిగా చదవలేకపోయేవాడినని అన్నారు సన్నీడియోల్. గదార్2 చేసేటప్పుడు తాను భయపడ్డ మాట వాస్తవమేనని అన్నారు. గదార్ 3 చేయడానికి తనకు ఎలాంటి భయమూ లేదని చెప్పారు సన్నీడియోల్.