English | Telugu

బన్నీ సంచలనం.. హిందీలో వంద కోట్ల మార్క్ దాటిన 'పుష్ప'!

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'. ఈ మూవీ హిందీలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా హిందీలో వంద కోట్ల మార్క్ ని అందుకొని సంచలనం సృష్టించింది.

పుష్ప మూవీపై తెలుగులో మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పాన్ ఇండియా మూవీగా రూపొందిన పుష్పని సరైన ప్రమోషన్ చేయకపోవడంతో.. హిందీలో మాత్రం పది కోట్లు కలెక్ట్ చేస్తే గొప్పని భావించారంతా. కానీ డిసెంబర్ 17 న థియేటర్స్ లో విడుదలైన పుష్ప అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హిందీలో సత్తా చాటింది. హిందీ స్ట్రయిట్ సినిమాలు సైతం పుష్పతో పోటీ పడలేకపోయాయి. మరోవైపు సినీ, క్రికెట్ స్టార్స్ సైతం పుష్ప మేనియాలో పడిపోయారు. 'తగ్గేదేలే' అంటూ డైలాగ్ లు, 'శ్రీవల్లి' అంటూ స్టెప్పులతో బన్నీని ఇమిటేట్ చేస్తూ సందడి చేశారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పుష్ప కలెక్షన్ల సునామీ సృష్టించింది.

పుష్ప హిందీ వెర్షన్ తాజాగా వంద కోట్ల మార్క్ దాటింది. ఇప్పటిదాకా పుష్ప రూ.100.28 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. హిందీలో పుష్ప ఇప్పటిదాకా 125 కోట్ల గ్రాస్, 47 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. పుష్పతో హిందీలో వంద కోట్ల మార్క్ ని దాటి బన్నీ సంచలనం సృష్టించడంతో.. ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.