English | Telugu

ఆస్పత్రిలో చేరిన దిలీప్‌ కుమార్‌ భార్య సైరా బాను!

దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్‌ కుమార్‌ సతీమణి సైరా బాను అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు. గత మూడు రోజులుగా రక్తపోటు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను పరిస్థితి విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిహితులు తెలిపారు.

ఈ యేడాది జూలై 7 న దిలీప్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఆయన మృతితో మానసికంగా కృంగిపోయిన సైరా బాను అనారోగ్యం బారిన పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రక్తపోటు పెరగడంతో కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌లో జాయిన్ చేసారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

కాగా దిలీప్ కుమార్, సైరా బానులది ప్రేమ వివాహాం. దిలీప్ కుమార్(98) కన్నుమూసేంత వరకు వీరు ఎంతో అనోన్యంగా ఉన్నారు. దిలీప్ కుమార్ ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు దగ్గరుండి సైరా బాను సేవలు చేశారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.