Read more!

English | Telugu

భోగి రోజు అమితాబ్ చేసింది ఇదే..వాళ్ళ అమ్మ చెప్పింది

సుమారు ఐదు దశాబ్దాల నుంచి నటనే తన ఊపిరిగా బతుకుతున్న నటుడు అమితాబ్ బచ్చన్( Amitabh bachchan) ఇంతవరకు 188  చిత్రాలకి పైగా నటించిన ఆయన  ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి నటులవ్వగానే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా   కూడా నిలిచారు.తాజాగా ఆయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ప్రస్తుతం భారతదేశం మొత్తం సంక్రాంతి సెలెబ్రేషన్స్ మూడ్ లో ఉంది. అందులో భాగంగా ఈ రోజు భోగి పండగ ని జరుపుకుంటున్నారు. ఈ భోగి పండగని నార్త్ లో లోహ్రి అని పిలుస్తారు. అమితాబ్ చిన్నప్పుడు లోహ్రి రోజున జానపద కళాకారులు లోహ్రి దా టక్కా దే రబ్ యానూ బచ్చాదే అని పాటలు పాడుకుంటూ వచ్చే వాళ్ళు. అప్పుడు అమితాబ్ అమ్మ ఆయన చేత దానం చేయించేది. ఇప్పుడు ఈ విషయాన్నే ప్రస్తావిస్తు ఆయన ట్విటర్ లో పోస్ట్ చేసాడు.సోషల్ మీడియాలో అమితాబ్ ట్వీట్ ని చూసిన వాళ్లందరూ ఈ వయసులో కూడా అమితాబ్  ఆనాటి విషయాలని గుర్తుతెచ్చుకొని మరీ చెప్తున్నారంటే చాలా గ్రేట్ అంటున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 81 సంవత్సరాలు