English | Telugu

ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేసాను.. దూరంగా ఉండాలనుకుంటున్నాను 

బాలీవుడ్ బిగ్ బి 'అమితాబ్ బచ్చన్'(Amitabh Bachchan)నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన 'అభిషేక్ బచ్చన్'(Abhishek Bachchan)మంచి నటుడుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతు తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఈ నెల 6 న 'హౌస్ ఫుల్ 5(Housefull 5)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రితీష్ దేశ్ ముఖ్, జాకీ ష్రఫ్, సంజయ్ దత్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ 'నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే కొన్నిసార్లు అందరికి దూరంగా ఉండాలనే పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ కి అభిషేక్ రిప్లై ఇస్తూ' కొన్ని రోజులు జనసమూహానికి దూరంగా ఉంటు నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకెంతో ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేసాను. ఇప్పుడు నా కోసం సమయం కేటాయించుకోవాలని అనిపిస్తుందని పోస్ట్ చేసాడు. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ ని షేర్ కూడా చేసాడు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

అభిషేక్ ప్రస్తుతం 'రాజా శివాజీ'(Raja Shivaji)అనే కొత్త చిత్రంలో చేస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj)జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుండగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రితీష్ దేశముఖ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్ జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తోంది. జెనీలియా, రితీష్ దేశముఖ్ భార్య, భర్తలు అనే విషయం తెలిసిందే.