Read more!

English | Telugu

గ‌త వారం టాప్ 5లో నిలిచిన ఓటీటీ షోస్ ఇవే!

 

ఓటీటీ ప్లాట్‌పామ్‌లు చెప్పే లెక్క‌ల‌కు, వాస్త‌వానికీ పొంత‌న ఉండ‌ద‌నే పేరుంది. పార‌ద‌ర్శ‌క‌త లోపించ‌డంతో అవి చెప్పే లెక్క‌లు నిజ‌మైన‌ప్ప‌టికీ న‌మ్మ‌లేని స్థితి నెల‌కొని వుంది. అయితే మీడియా క‌న్స‌ల్టింగ్ కంపెనీ అయిన ఆర్‌మాక్స్ మీడియా వివిధ ఓటీటీ వేదిక‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌కు సంబంధించిన వ్యూయ‌ర్‌షిప్‌ను ట్రాక్ చేయ‌డం ప్రారంభించింది. గ‌త‌వారం అంటే.. జ‌న‌వ‌రి 24 నుంచి జ‌న‌వ‌రి 30 వ‌ర‌కు అత్య‌ధికులు వీక్షించిన షోలు, సినిమాల లిస్టును ఇస్తున్నాం. ఈ లెక్క‌ల‌న్నీ మ‌న‌దేశంలోప‌ల మాత్ర‌మే వేసిన అంచ‌నాలు. వీటిలో ద‌క్షిణాది నుంచి స్ట్రీమింగ్ అవుతున్న షోలు, సినిమాల‌ను లెక్క‌లోకి తీసుకోలేదు.

1. భౌకాల్ 2 - ఎంఎక్స్ ప్లేయ‌ర్‌
వ్యూస్ : 5.8 మిలియ‌న్‌
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ క్రైమ్ డ్రామాలో మోహిత్ రైనా, అభిమ‌న్యు సింగ్‌, సిద్ధాంత్ క‌పూర్‌, బిదితా బాగ్‌, ప్ర‌దీప్ నాగ‌ర్ న‌టించారు.

2. అన్‌పాస్డ్: న‌యా స‌ఫ‌ర్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
వ్యూస్‌: 3.5 మిలియ‌న్‌
ఐదుగురు ద‌ర్శ‌కులు నూపుర్ అస్థానా, అయ్య‌ప్ప కె.ఎం., రుచిర్ అరుణ్‌, శిఖా మ‌క‌న్‌, నాగ‌రాజ్ మంజులే చూపించిన ఆశ‌, ప్రేమ‌, బంధాలు, సెకండ్ చాన్స్‌ల‌కు సంబంధించిన కొత్త క‌థ‌లివి.

3. హ్యూమ‌న్ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌
వ్యూస్‌: 2.7 మిలియ‌న్‌
విపుల్ అమృత్‌లాల్ షా, మోజెస్ సింగ్ క‌లిసి సృష్టించిన ఈ మెడిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో షెఫాలీ షా, కృతి కుల్హ‌రి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. Also read: ఫిబ్ర‌వ‌రి 24న అజిత్ 'వ‌లిమై' వ‌స్తోంది

4. క‌పిల్ శ‌ర్మ‌: అయామ్ నాట్ డ‌న్ యెట్ - నెట్‌ఫ్లిక్స్‌
వ్యూస్‌: 2.2 మిలియ‌న్ వ్యూస్‌
క‌మెడియ‌న్‌, పాపుల‌ర్ టాక్ షో హోస్ట్ అయిన క‌పిల్ శ‌ర్మ ఫ‌స్ట్ కామెడీ స్పెష‌ల్ అయామ్ నాట్ డ‌న్ యెట్‌లో అత‌ని జీవితం, అత‌ని స్ట్ర‌గుల్స్‌, దివంగ‌తుడైన తండ్రితో అత‌డి అనుబంధాన్ని చూపిస్తుంది. Also read: ​బన్నీ సంచలనం.. హిందీలో వంద కోట్ల మార్క్ దాటిన 'పుష్ప'!

5. యే కాలీ కాలీ ఆంఖే - నెట్‌ఫ్లిక్స్‌
వ్యూస్‌: 2.1 మిలియ‌న్‌
ఒక రాజ‌కీయ నాయ‌కుడి కుమార్తె త‌న‌ను పెళ్లిచేసుకోవ‌డానికి ఎంత‌టి ప‌నికైనా సిద్ధ‌ప‌డ‌టంతో, త‌న జీవితాన్ని తిరిగి పొందేందుకు చిన్న టౌన్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఎలాంటి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నాడ‌నేది ఇందులోని ప్ర‌ధానాంశం. తాహిర్ రాజ్ భాసిన్‌, శ్వేతా త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లు చేశారు.