English | Telugu
బాద్షా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... స్పెషల్ స్క్రీనింగ్ రెడీ!
Updated : Oct 12, 2023
షారుఖ్ ఖాన్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో కుచ్ కుచ్ హోతా హైకి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ సినిమా విడుదలై పాతికేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ని అనౌన్స్ చేశారు. రొమాంటిక్ డ్రామాల లిస్టులో ఇప్పటికీ బెస్ట్ ప్లేస్‌లో ఉంటుంది కుచ్ కుచ్ హోతా హై. ఐకానిక్ స్టేటస్ ఉన్న సినిమా ఇది. మొమరబుల్ డైలాగ్స్ నుంచీ, టైమ్‌లెస్ సాంగ్స్ వరకు, ప్రతి యాస్‌పెక్ట్ లోనూ అద్భుతంగా అనిపించే సినిమా కుచ్ కుచ్ హోతా హై. షారుఖ్ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ నటించిన ఈ సినిమాను అక్టోబర్ 15న ఫ్యాన్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నట్టు ప్రకటించారు క్లాసిక్ ఫిల్మ్ మేకర్స్. ధర్మా మూవీస్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. పీవీఆర్ ఐకాన్స్ లో ఈ మ్యాజిక్‌ని అందరూ విట్‌నెస్ చేయాలని అన్నారు కరణ్ జోహార్.
తుజీ యాద్ నా మేరి ఆయీ పాటను 2.0 వెర్షన్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు కరణ్ జోహార్. ఈ పాటను పాడినందుకు ఎంతో ఆనందంగా ఉందని సింగర్ బి ప్రాక్ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
కుచ్ కుచ్ హోతా హై అక్టోబర్ 17, 1998లో విడుదలైంది. అప్పట్లో థియేటర్లలో ఈ సినిమాను విపరీతమైన స్పందన వచ్చింది. షారుఖ్‌కి మాత్రమే కాదు, కాజోల్, రాణీ ముఖర్జీ కెరీర్ బెస్ట్ సినిమాల్లో కుచ్ కుచ్ హోతా హై ఒకటి. షారుఖ్ ఈ ఏడాది ఆల్రెడీ, పఠాన్, జవాన్ సినిమాలతో ఉన్న బెస్ట్ రికార్డులన్నిటినీ కొల్లగొట్టేశారు. ఇప్పుడు కుచ్ కుచ్ హోతా హై పాతికేళ్లను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. త్వరలోనే టైగర్3తోనూ ఫ్యాన్స్ ని మరో సారి పలకరించడానికి రెడీ అవుతున్నారు.