Facebook Twitter
సముద్ర తీరం

సముద్ర తీరం

సముద్రతీరం పోవటం చాలా మంది పిల్లలకు వినూత్న అనుభవం. మనదేశానికి అంత పొడవు తీరరేఖ ఉన్నా, ఆ రేఖకు కడు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని లక్షలాది మందికి తమ జీవితంలో ఒక్కసారికూడా సాగరుడిని చూసే అవకాశం ఉండదు. చెన్నేకొత్తపల్లి పిల్లల్లోకూడా, నిజానికి, నూటికి 99 మందికి ఈ భాగ్యం కలగలేదు- అయినా పాడుతున్నారు ముచ్చటగా- చిలుక పలుకులు!


సముద్ర తీరం పోతిమి, చాల సేపు చూస్తిమి
సూర్యుడెంతో గుండ్రముగా చల్లని వెన్నెల కాయగా
అలలు చక్కగ దొర్లుతూ, అవసరముగ పొర్లుచూ
నిలిచిఉన్న మాపైన,నీళ్ళు ఎత్తి  చల్లెను
కొత్త పావడా తడిసెను, ఎత్తి పట్టి నడిచాను
అంతలోన గవ్వలు, ఎంతో తెల్లగ వచ్చెను
జవర పట్ట బోతిమి, అన్నీ జారిపోయెను

Courtesy..
kottapalli.in