ఆనాడు ఆజాతికి
దేవాలయాలలోకి
ప్రవేశమే లేకుండే...
నేడు రాజ్యాంగ నిర్మాత...
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన
రిజర్వుడు స్థానాలతో దేవాలయాల వంటి
అసెంబ్లీలో అడుగుపెట్టే శాసనసభ సభ్యులై
పార్లమెంట్లో పాదంమోపే లోక్ సభ సభ్యులై
రాష్ట్రపతిగా శాసన సభాపతిగా...
అత్యున్నత పీఠాలనధిరోహించే...
దళితమేధావులు...విజ్ఞానజ్యోతులై...
మొన్న ఉమ్మడిరాష్ట్రంలో ప్రతిభాభారతి
నేడు "పోరాటాల గడ్డ" తెలంగాణ
శాసనసభకు మూడో స్పీకర్‌గా...
తెలంగాణాకు తొలిదళిత సభాపతిగా...
వికారాబాద్ నుండి విజయం సాధించిన
"దళిత బిడ్డ" గడ్డం ప్రసాద్ కుమార్ 111
మంది సభ్యుల మద్దతుతో ఏకగ్రీవ ఎన్నిక
ఇది "పేదలకు పెద్దపీట" వేసే కాంగ్రెస్
అధిష్టానం తీసుకున్న అనూహ్య నిర్ణయం...
వికారాబాద్ జిల్లా...
తాండూరు మండలం...
బెల్కటూరు గ్రామంలో...
అతి సామాన్య నిరుపేద
దళిత కుటుంబంలో పాలమ్ముకునే
పాల ఎల్లమ్మ ఎల్లయ్యలకు జన్మించి...
చిన్న వయసులో తండ్రిని కోల్పోయి...
8 మంది సోదరీమణులున్న
పెద్ద కుటుంబానికి పెద్దదిక్కుగా...
9 సంవత్సరాలు ఏ పదవి లేకున్నా
ప్రజా సమస్యలకై నిరంతరం పోరాడిన
"ప్రజాప్రతినిధి...దళితబంధు"...
గడ్డం ప్రసాద్ కుమార్...జయహో జయహో
వైయస్సార్ రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి
మంత్రివర్గంలో మంత్రిగా అనుభవమున్న
"స్నేహశీలి...ప్రతిభాశాలి...దళితబిడ్డ"...
గడ్డం ప్రసాద్ కుమార్...జయహో జయహో
సభను నిష్పక్షపాతంగా నిర్వహించగల దిట్ట
సభ్యుల హక్కులను కాపాడగల సత్తా వున్న
"బహుజన నేత...దళిత జ్యోతి...
గడ్డం ప్రసాద్ కుమార్...జయహో జయహో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
తెలంగాణ సచివాలయంలో...
కొత్తగా కొలువుదీరిన
కాంగ్రెస్ నూతన శాసనసభలో...
ప్రతి సభ్యునికి తమ గళం
వినిపించేందుకు...అవకాశమిస్తారని...
పార్టీల కతీతంగా ప్రతి ఒక్కరి గౌరవ
మర్యాదల్ని...సభా సంప్రదాయాలను
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతారని...
నిష్పక్షపాతంగా సభను నిర్వహిస్తారని...
మొన్న ఎంపీటీసీగా...
నిన్న యం.ఎల్యేగా...
నేడు శాసన సభాపతిగా...
ఎన్నికైన మితభాషి...స్నేహశీలి...
ప్రతిభాశాలి...అజాతశతృవు...
దళితబిడ్డ" గడ్డం ప్రసాద్ కుమార్ పై...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
భట్టి..కేటీఆర్...సీతక్క...ఉత్తమ్ లాంటి
ప్రముఖుల ప్రసంగాలతో...సభలో
"ప్రశంసల కుంభ వర్షం" కురిసింది...
"దళిత బిడ్డ" గడ్డం ప్రసాద్ కుమార్ కు
"శాసన సభాపతిగా పట్టాభిషేకం" జరిగింది
జ్ఞానజ్యోతి వెలిగింది దళితజాతి మురిసింది



