తెలుగు భాషంటే..."వెలుగు భాష"
తెలుగు భాషంటే...ఒక "సముద్రపు ఘోష"
తెలుగు యాసంటే... మన "గొంతులో శ్వాస"
కొమ్మల్లో దాగిన జుంటి తేనియలకన్న
అతిమధురమైనది..."మనతెలుగుభాష"
ఒయ్యారా లొలికే ఆ బాపుబొమ్మ కన్నా
అందాల ఆ చందమామ కన్నా
బహు సుందరమైనదని..."మన తెలుగుభాష"
పరుగుల తీసే సజీవ నదులన్నవి
తమ పరుగులు భారతావని వరకేనని కానీ
ఎక్కడ ? ఎక్కడ ? ఈ సువిశాల ప్రపంచంలో
ప్రవహించనిదెక్కడ నా "తేనెలూరే తెలుగునది"
"అమ్మతనమున్నది" అందమైన మనతెలుగుభాషలో
"తెలుగుతనమున్నది" పింగళి వెంకన్న వూహల్లో
పురుడుపోసుకున్న మన జాతీయజెండాలో...
మన తెలుగుకవుల కలాల్లో పల్లవించిన పద్యాలు
అష్టావధానాల విశిష్టమైన విలక్షణమైన వినూత్నప్రక్రియలు
కనపడవు ప్రపంచభాషల్లో వెయ్యికాగడాలు పెట్టివెతికినా...
మన సినీకవుల కలాల్లో పుట్టి మన గాయకుల
సుమధుర గాత్రాలలో అమృతమై "ప్రవహించించింది...
దేశభాష లందులెస్సన్న మన"తెలుగుభాష కమ్మదనం"
దేశాలెన్నిదండెత్తినా చలించనిది"మనభరత ఖండం"
పరాయి బాషలెన్ని దండయాత్రలు చేసినా
చెక్కుచెదరినిది...మన "తెలుగుభాషా సౌందర్యం"
తెలుగు భాషే మన శ్వాస...తెలుగు భాషే మన ఊపిరి
తెలుగుతల్లే మనదేవత...ఆ తల్లికే మనజీవితాలంకితం



