చెత్తకుండీలోఎంగిలి మెతుకులు
ఏరుకునే "బిక్షగాన్నీ" కిటికీలో నుండి
"చూసిన ఓ ధనవంతుడు"
"థ్యాంక్స్ టు గాడ్..
నేను బిక్షగాన్ని కాదు" అనుకున్నాడట
మతిస్థిమితం కోల్పోయి
నగ్నంగా నడివీధిలో తిరిగే
"పిచ్చివాన్ని చూసిన ఓ బిక్షగాడు"
"థ్యాంక్స్ టు గాడ్....
నేను పిచ్చివాన్ని కాదు"అనుకున్నాడట
కరోనా వైరస్ సోకి అంబులెన్స్ లో
హాస్పటల్ కెళ్ళే రోగిని చూసిన,
కాస్త "ఇంగ్లీషొచ్చిన ఓ పిచ్చోడు"
"థ్యాంక్స్ టు గాడ్..
అయామ్ నాట్ ఎ కరోనా పేషెంట్"
అనుకున్నాడట
హాస్పిటల్లో మందుల్లేక వైద్య మందక
మరణించి మార్చురీకి వెళ్ళే
"కరోనా శవాన్ని" చూసిన మరో రోగి
"థ్యాంక్స్ టు గాడ్..
నేనింకా బ్రతికే ఉన్నాను" అనుకున్నాడట
నిజానికి ఒక్క చనిపోయినవారే
భగవంతునికి థ్యాంక్స్ చెప్పలేరు
మరి అన్ని అవయవాలనిచ్చిన
మంచి ఆరోగ్యాన్నిచ్చిన
తరతరాలకు తరగని ఆస్తినిచ్చిన
ఏ రోగాలురాని,ఏ కష్టాలులేని
ఏ కరోనా వైరస్ సోకని
ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించిన
ఆ భగవంతునికి, బాగానేవున్న
బ్రతికేవున్న, ఉన్నతస్థితిలో వున్న
మీరెందుకు కృతజ్ఞతలు
చెప్పలేకపోతున్నారు
ఒక్కసారి ఆలోచించండి
లెటజ్ సే థ్యాంక్స్ టు గాడ్....
ఎందుకు ? కరోనా కాటెయ్యనందుకు....



