ఎందరో
తలపండిన
పండితులందరి
అంచనాలను మించి
అతిపిన్న వయసులోనే
అధికార పీఠాన్ని అధిరోహించిన
"జాతినేత"ఎవరన్నా?ఎవరన్నా ?ఇంకెవరన్నా
జాతి నచ్చిన...జగతి మెచ్చిన మన జగనన్న
నీలాపనిందలు మోపినా
తలపై ముళ్ళకిరీటం పెట్టినా
కొరడాలతో కొట్టినా
సిలువపై వేలాడదీసి
చిత్రహింసలకు గురిచేసినా
"తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు
వీరిని క్షమించమని" పలికిన
కరుణామయుడైన క్షమాగుణంగల ఆ
"రక్షకుడైన యేసుక్రీస్తులా"
కక్షతోఎన్నో కోర్టుకేసుల్లో ఇరికించినా...
ఎన్నో ఇబ్బందులు పెట్టినా...
ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా...
అదరక బెదరక ఎదురు తిరిగినోడు..
కొండలనే ఢీకొట్టి పిండిచేసినోడు...
"అభినవ అల్లూరి సీతారామరాజులా"
సింహబలుడు... సాహసవీరుడు...
మడమతిప్పని మగధీరుడు...
రాజకీయ రణరంగంలో
ప్రత్యర్థులు పన్నిన పద్మవ్యూహాలన్నీ
ఒంటరిగా ఛేదించిన "అభినవ అభిమన్యుడు"
ఎవరన్నా ?ఎవరన్నా ?ఇంకెవరన్నా
జాతి నచ్చిన...
జగతి మెచ్చిన మనజగనన్న
గుండెల్ని పిండేసే దుర్ఘటనలో
కన్నతండ్రి ఘోరంగా కన్నుమూస్తే
తమ "ఇంటిదీపమే" ఆరిపోయినట్లు
కన్నీరు మున్నీరైన ప్రజలందరిని
వేలమైళ్ళు పాదయాత్రలు చేసి
ఓదార్చిన "దయార్ద్ర హృదయుడు
"ప్రేమామయుడు" కరుణామయుడు"
"తండ్రి రాజశేఖరుని మించిన తనయుడు"
ఎవరన్నా ? ఎవరన్నా ? ఇంకెవరన్నా
జాతి నచ్చిన...
జగతి మెచ్చిన మన జగనన్న
పేదల పాలిటి పెన్నిధి
"అందరివాడు" "ఆపద్బాంధవుడు"
పీడిత తాడిత బడుగు బలహీనవర్గాల
"ఆశాజ్యోతి "అభినవ అంబేద్కర్"
ఎవరన్నా ? ఎవరన్నా? ఇంకెవరన్నా
జాతి నచ్చిన...
జగతి మెచ్చిన మన జగనన్న



