Facebook Twitter
నిప్పురవ్వ నిఖిలేశ్వర్....

నిఖిలేశ్వర్ అంటే ఒక నిప్పురవ్వ
నిఖిలేశ్వర్ అంటే ఒక విప్లవ జ్వాల
నిఖిలేశ్వర్ అంటే ఒక సాహితీ శిఖరం
నిఖిలేశ్వర్ అంటే ఒక దిగంబర దివిటీ

ఎడమ చేత్తో ఎర్రజెండా వాడవాడల ఎగరేసి
రజాకార్ల గుండెల్లో నిదురించిన విప్లవవీరుడు
కుడి చేత్తో కత్తికన్నా పదునైన కలాన్ని పట్టి
సామాజిక రుగ్మతలపై,కార్మిక, శ్రామిక వర్గాలకోసం
సమరం సాగించిన సాహసి,
పేదప్రజల పక్షపాతి

శతృవులతో,మిత్రులతో,
సిద్ధాంతపర,విభేదాలతో
ఎక్కవలసినన్ని మెట్లు ఎక్కలేకపోయినందుకు
దక్కవలసినంత గౌరవం దక్కనందుకు,దుఃఖంతో
కుమిలిపోయిన కృంగిపోయిన
సాహితీ కృషీవలుడు

కొత్త మనుషులు కావాలని,
నాదేశంలో నేనొక
పరాయివాడనని, గోడకు తన గోడును,వినిపించినవాడు
సిద్ధార్థుడు బుద్దుడైనట్లు యదవరెడ్డి నిఖలేశ్వరుడయ్యాడు
దిగంబర కవిత్వానికే దిక్కయ్యాడు
ఒక దిక్సూచయ్యాడు