Facebook Twitter
కళాతపస్వి విశ్వనాథ్   సప్తపది చిత్ర సందేశం...?

ఆహా ఏమి చిత్రం..?
అదొక ఆణిముత్యం..!
ఆహా !ఏమీ సంగీతం..?
అది ఒక గంగాప్రవాహం..!
ఆహా ఏమీ ఆ దివ్యసందేశం...?
అది కుల మతాలకు సమాధి..
అది నవసమాజానికి పునాది...
ఆహా ఏమి సాహసం..?
అంధవిశ్వాసుల కళ్ళు తెరిపించేలా... 
మతచాంధస్సులకు కనువిప్పుకలిగించేలా..
విమర్శకులతో సైతం ప్రశంసలు పొందేలా...

ఆహా ఏమి ముందుచూపు..?
ప్రశంసలవర్షం కురిసేలా...
ప్రపంచమంతా పరవశించేలా...
తెలుగువారంతా తలెత్తుకు తిరిగేలా...
వెండితెర సాక్షిగా...సాక్షాత్తు
ఆ ఈశ్వరుడే.....ఆ పరమేశ్వరుడే...
ఆ శ్రీనివాసుడే...ఆ శ్రీకృష్ణ భగవానుడే...

కళాతపస్వి...
వెండితెర వేల్పు...
బహుముఖ ప్రజ్ఞాశాలి...
మన తెలుగుజాతి జ్యోతియైన...
ఈ కాశీవిశ్వనాధుడి రూపంలో...
ఆ దివినుండి...భువికి దిగివచ్చి...

సామాజిక సమస్యలే ఇతివృత్తంగా...
వెండితెర నటులచే...కళాకారులచే ...
తరతరాలుగా ఈ మానవసమాజంలోని... వైషమ్యాలకు తారతమ్యాలకు వ్యతిరేకంగా

మనుషులంతా ఒక్కటేనని...
మనందరి"కులం మానవకులమని"...
మనమంతా ఆ పరమాత్మ బిడ్డలమని...
కులమతాల అడ్డుగోడల్ని కూల్చివేయాలని
కులమనే విషవృక్షాన్ని కూకటివేళ్ళతో సహా
పెకలించివేయాలని...కూల్చికాల్చివేయాలని

అందరి ఆశ...శ్వాస...ఒకటేనని...
అదే మంచితనం...మానవత్వమని...
అదే సమానత్వం...సౌభ్రాతృత్వమని...
అందరూ సోదరభావంతో కలిసిమెలిసి
హాయిగా...ప్రశాంతంగా...జీవించాలని...

సామాజిక రుగ్మతలను
తక్షణమే సమాధి చేయాలని...
ప్రజాస్వామ్య పునాధులపై
నవసమాజాన్ని నిర్మించాలని
కులరక్కసిపై విసిరిన ఓ రామబాణం
కళాతపస్వి విశ్వనాథ్"సప్తపది" చిత్రం...
అద్వితీయంగా...చెక్కిన ఓ అమరశిల్పం... 
అపురూపంగా తీర్చిదిద్దిన ఓ కళాఖండం...
అజరామరమైన అభ్యుదయ సందేశాన్ని
విశ్వానికి అందించిన ఓ అమృతభాండం...

అందుకే...92
ఏట కన్నుమూసిన
ఈ విశ్వంభరునికి...‌
ఈ విశ్వనాథుడికి...
ఈ అభినవ ఆదిశంకరునికి...
ఈ కళామతల్లి ముద్దుబిడ్డకి...
ఈ ఖాకీదుస్తుల కళాతపస్వికి...
ఈ విశ్వనరుని విశ్వరూపానికి...
తెలుగుజాతి మొత్తం...
చేతులు జోడించి...శిరస్సులు వంచి
పాదారవిందాలకు ప్రణమిల్లాలి...అదే
ఆ"దర్శక దిగ్గజానికి"అశృనయనాలతో మనం అర్పించే...ఘనమైన...నిజనివాళి