Facebook Twitter
నిరుద్యోగుల ప్రతినిధి…

నిన్న శిరీష ఒక గొంతు
నేడు కోటి గొంతుల కలయిక

నిన్న శిరీషది ఏకాంతం
నేడు శిరీషది జగమంత కుటుంబం

నిన్న శిరీష ఒక నిస్సహాయురాలు
నేడు శిరీషచుట్టూ ఓ ఆత్మీయ రక్షణకవచం

నాడు గాంధీజీ పిలుపు
వందేమాతర గీతం
భారతీయ యువతను ఉర్రూతలూగించే....

నేడు శిరీష "విజిల్ "మారుమ్రోగే...
కొల్లాపూర్ నియోజకవర్గమంతా...

ఢిల్లీ ఎర్రకోటను తాకింది...
ఖండాంతరాలు దాటింది...
బర్రెలక్క బరిలో దిగిగానే
పట్టే...అభ్యర్థులకు చెమటలు...

అంచనాలు తారుమారై
ఎవరు బకరౌతారో...
ఎవరు బలౌతారో...అర్థంకాక
అయోమయంలో...అభ్యర్థులు
గోక్కుంటున్నారు....బుర్రలు
పరుగెడుతున్నాయి...గుండెల్లో రైళ్లు 
ఆవహించింది...ఓటమి భయం భూతమై

అందుకే
ఈ దాడులు...
ఈ దౌర్జన్యాలు...
సోషియల్ మీడియాలో
ఈ బెదిరింపులు వేధింపులు...
ఈ ప్రలోభాలు పగలు ప్రతీకారాలు...
ఈ దుర్మార్గమైన వ్యక్తిగత దూషణలు...

శిరీష శిరాన MLA కిరీటం పెట్టాలి
శిరీష చట్టసభలో అడుగు పెట్టాలి
నిరుద్యోగుల ప్రతినిధిగా...
నిరుపేదల ఆశాజ్యోతిగా...
యువతీయువకులకు స్పూర్తి మంత్రంగా...
నేడు కాకపోయినా రేపైనా...