రామబాణం సంధించు..! రామరాజ్యం స్థాపించు..!
అయ్య బాబోయ్
వచ్చేస్తున్నాయట..!
తేళ్ళు...
తోడేళ్ళు...
విషసర్పాలు...
ఊసరవెల్లులు...
బంగారు బల్లులు...
ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..?
ఓ ఓటరన్నా..!
నీకేటి భయం...
నీ వ్రేలికి ఉందిగా...
"సుదర్శన చక్రం"..!
నీ భుజం మీద ఉందిగా...
"గండ్రగొట్టలి"..!
నీ అరచేతిలో ఉందిగా...
"అణుబాంబు"..!
నీ వ్రేలిమీద వేసే
సిరాచుక్కలో ఉందిగా...
ఓటనే "వజ్రాయుధం"..!
నీ హక్కుల
అంబులపొదిలో ఉందిగా...
రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బి .ఆర్.అంబేద్కర్
అందించిన..."రామబాణం"..!
అందుకే ఓ ఓటరన్నా..!
ఆ రామబాణం సంధించు..!
రాజకీయ రావణాసురులను
కారడవులకు పంపించు..!
రామరాజ్యం స్తాపించు..!
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు..!



