ఓ మనిషీ !
జయించడానికే నీవు జన్మించాపు
ప్రతి పనిని వాయిదా వేస్తూ
బద్దకంగా ఒళ్ళు విరువకు
శ్రమయేవ జయతే అన్ననినాదం మరువకు
నిరంతరం కసితో, కృషితో,
పగతో,పట్టుదలతో,దృఢమైన దీక్షతో,
పటష్టమైన ప్రణాళికతో
ఆశే శ్వాసగా సాగిపో ముందుకు
ఎందుకంటే,
పక్షి వేగంగా ఎగురుతుంది
పాము వేగంగా పాకుతుంది
చేప వేగంగా ఈదుతుంది
జింక వేగంగా దూకుతుంది,మరి
ఈ కంప్యూటర్ యుగంలో వేగమేగా ప్రధానం
ఓ మనిషీ ! ఇక ఆగకు ఆలోచించకు
నడుం బిగించి నడకలో వేగం పెంచి
శ్రీరాముని బాణంలా దూసుకు పోవాలి
అరుణోదయ కిరణంలా చొచ్చుకు పోవాలి
ఓటమి నెన్నడు తలంచకు
ఓటమికెన్నడు తలవంచకు
విధినే తలదన్నువిజయాన్నేకలగను
కన్నకలలు ఫలించేదాక కునుకు తియ్యకు
అనుకున్నలక్ష్యాన్నిఛేదించేవరకు
నీ పరుగు ఆపకు
విజయం నిన్నువరించేదాక విశ్రమించకు
పని మాత్రమే నీది, ఫలితం
ఆ పరమాత్మదన్నసత్యం తెలుసుకో
ముందుకు దూసుకు పోయేవారినే
విజయం విందుకు పిలుస్తుందన్న
విషయం గుర్తుంచుకో, కానీ
ఓ మనిషీ ! ఒక్కటి మాత్రం పచ్చినిజం
ఓడి గార్దభంలా ఓండ్ర పెట్టేకన్నా...
గెలిచి పులిలా గాండ్రించడం మిన్న ...



