Facebook Twitter
చిరునవ్వులు

    నవ్వే...చిరుతపులులు

చంటి పిల్లల వంటి
చల్లని మంచి మనసున్న
పశువుల డాక్టర్ దిశను
అక్కా అంటూ పలకరించి
నక్కల్లా నటించి,నవ్వి,నమ్మించి
చిత్రహింసలకు గురిచేసి చంపిన
ఆ నీచ,నికృష్ట మనస్తత్వం కలిగిన
రాక్షసులు ఇంకెంతమంది మనచుట్టు
ముసుగు కప్పుకొని తిరుగుతున్నారేమో...
జరా జాగ్రత్త.... చెల్లీ...

ఇంటి నుండి బయలు దేరినప్పటినుండి
ఏదో వూహించని అఘాయిత్యానికి పాల్పడే
అపరిచితులు అడుగుడున దాగి వుండవచ్చు

తక్కువ చర్జీతో ఆటో
ఎక్కించుకు పోయే ఆటోవాడిలో
మాటిమాటికీ కేబిన్ కి రమమ్మంటూ,
దొంగచూపులు చూసే బాస్ లో...
అడగకపోయినా లిఫ్టు లిస్తూ
తాకాలని చిన్నచిన్న గిఫ్ట్ లు ఇస్తూ
తాకితే తన్మయత్వం చెందే మిత్రులలో...
ఏదో దురాలోచనతో పార్టీకి,
పార్క్ కు రమ్మనే బోయ్ ఫ్రెండులో
ఏ అపరిచితుడు దాగివున్నాడో...ఎవరికెరుక ?

అందుకే వీరి బారిన పడకుండా
తప్పించుకోవాలంటే నీకు శక్తినిచ్చే
ఏదో ఒక ఉపాయం
ఏదో ఒకరి స్మరణ
ఏదో ఒక గొప్ప వాక్యం నీకు కావాలి
ఏదో ఒక దేవత నిన్ను ఆవహించాలి
అఖండ శక్తి నీలోకి ప్రవహించాలి
నీవు నిర్భయంగా వుండాలి
నీవు నిప్పులా మండాలి
నిన్ను తాకిన వారు మాడి,మసైపోవాలి

అందుకే ఓ అమాయకపు చెల్లీ ...
నీవు తప్పుచేయబోయే ఆ బలహీనమైన
క్షణాలనుండి బయటపడాలంటే
నీవు వీరిలో,ఒక్కరినైనా గుర్తు చేసుకోవాలి
నీ అమ్మానాన్నలనో
నీ గురువునో
ఆ భగవంతుడినో
తప్పు చేయని ఆ సీతమ్మతల్లినో
ఏ బైబిల్, భగవద్గీత, ఖురాన్ లోని
ఏదైనా ఒక బంగారు వాక్యాన్నో
గుర్తు చేసుకుంటే చాలు
పెద్ధగండం నుండి నీవు గట్టెక్కినట్లే,
లేదంటే
నీ శీలాన్ని చీల్చే
చిరుతపులికి నీవు చిక్కీనట్లే...
పైకిక రాలేని కామపు
ఊబిలోకి నీవు జారిపోయినట్లే...