Facebook Twitter
మేరా భారత్ మహాన్...

మేరా భారత్ మహాన్...వందేమాతరం...
జనగణమన...జైజవాన్ జైకిసాన్...
సారే జహాసె అచ్చా ...ఇంక్విలాబ్ జిందాబాద్....అన్న నిప్పులాంటి నినాదాలే...నిత్యం మీ గుండెచప్పుళ్ళైతే...

ఈ దేశం నాకేమిచ్చిందని చీకటిలో కూర్చొని చింతించక ఈ సమాజానికి ఈ దేశానికి
నేనేమిచ్చానని క్షణం ఆలోచించమన్న
నిస్వార్థపరులైనస్వాతంత్ర్య సమరయోధుల
సంఘసంస్కర్తల శుభసందేశాల్ని
కలనైనా మీరు మరువకపోతే...

మట్టిని నమ్మి మట్టి నుండే మెతుకులు పుట్టించే మట్టిమనిషి రైతన్న నోట్లో
కొత్త సాగుచట్టాలతో మట్టికొట్టకపోతే...

కులం కుళ్ళని...మతం ముళ్ళని గ్రహించి
కులంరొచ్చులో కూరుకుపోక మతంమత్తులో
ఉన్మాదులై...మతంచిచ్చు రగిలించకపోతే...
మారణహోమాలు సృష్టించకపోతే...

మీలో జాతీయత...నిజమైన దేశభక్తి...
సద్భావన స్ఫూర్తి...నిండుగా ప్రవహిస్తున్నట్లే
జైహింద్...జై భారత్....