ఈ నగ్నసత్యం తెలిసేది ఎందరికి?
కొందరు ఆసుపత్రికి వెళ్ళి
ఆపరేషన్లకని డాక్టర్లకని
రిపోర్టులకని మందులకని
లక్షల రూపాయలు బిల్లులు కడతారు
కాని సాటి మనిషి
అవసరాన్ని గమనించరు
ప్రక్కవారు ఎన్ని ఇక్కట్లు ఇబ్బందులు
పడుతున్నా పట్టించుకోరు
చేయగలిగివుండీ సహాయం చేయరు
మొండి చేయి చూపిస్తారు
కాని
మన ఆనందం
మన ఆత్మతృప్తి
మన ఆరోగ్యం
మన ఆయిష్షు అంతా
మనకున్నదానిలో కొంత
పరులకు పంచడంలోనే
ఇరుగుపొరుగుకు ఇవ్వడంలోనే వుందన్న
అదే మన ఆరోగ్యానికి మూలకారణమన్న
ఈ నగ్నసత్యం తెలిసేది ఎందరికి?
నిజానికి ఆ సత్యం
తెలిసేసరికి చీకటి పడిపోతుంది
ఈ బ్రతుకు చితికిపోతుంది "చితికి" చేరిపోతుంది



