ఏ సంస్థకైనా మంచి పేరు రావాలన్నా
ప్రగతి పథంలో పయనించాలన్నా
ప్రజల మన్ననలు పొందాలన్నా
ఉన్నత శిఖరాలకు చేరాలన్న
అత్యున్నత పురస్కారాలను అందుకోవాలన్నా
అందుకు సంస్థలో వున్న ప్రతి ఒక్కరూ
నీతిగా నిజాయితీగా వుండాలి
నిబద్ధతతో అంకితభావంతో పని చేయాలి
నిద్రాహారాలు మాని నిరంతరం శ్రమించాలి
గట్టి పట్టుదలతో దృఢమైన దీక్షతో
సమిష్టిగా సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలి
కాని,
ఒక్కరివల్ల వారి వక్రబుద్ధి వల్ల
సంస్థకు అపారమైన నష్టం
జరగకముందే మేల్కోనకపోతే ఎలా?
అట్టి వారికి, గట్టిగా బుద్ది చెప్పకపోతే
వారిని బయటికి నెట్టకపోతే ఎలా?
కఠినంగా వ్యవహరించకపోతే
నిప్పులాంటి నిర్ణయం తీసుకోకపోతే ఎలా?
భవిష్యత్తులో సంస్థ పై
కస్టమర్స్ కు నమ్మకం పోవచ్చు
సంస్థకు వున్న
మంచిపేరు మాయమైపోవచ్చు
మాయని మచ్చ రావచ్చు
సంస్థ ఆరిపోయే దీపం కావచ్చు
మునిగి పోయే పడవ కావచ్చు
అందుకే
ప్రమాదం రాకముందే
పునాదులు కదలకముందే
ఆధారపడిన అందరికి
అన్యాయం జరగక ముందే జాగ్రత్త పడాలి.



