Facebook Twitter
వారే వీరులు శూరులు మగధీరులు…

చీకటిలో తడుముకుంటూ
తిరిగినంతకాలం నీవెక్కడికీ వెళ్ళలేదు

చిరుదీపం వెలిగించుకోక చీకటిని తిట్టుకుంటూ కూర్చున్నంతకాలం నీవు ఏ వెలుగునూ చూడలేవు

చీకటిని తరుముకుంటూ వెళ్ళిన వారే
చీకటి తెరలు చీల్చుకుంటూ వెళ్ళి నవారే
వెలుగును వెతకగలరు సుఖంగా బ్రతకగలరు

నలుగురికి ఆదర్శంగా నిలవగలరు
ఎట్టి పోటీలోనైనా గట్టిగా తలపడి గెలవగలరు

మట్టిని పిండైనా తైలం తీయగలరు
ఎట్టి క్లిష్టపరిస్థితుల నుండైనా బయట పడగలరు

కొండమీదికోతినైనా నేలమీదికి దింపగలరు
పరులను హింసించు నరులను పాతాళానికి పంపగలరు
సమాజాన్ని దేశాన్ని సుఖశాంతులతో నింపగలరు

వారే వారే వీరులు శూరులు మగధీరులు